Kumbh Mela 2025: 50 కోట్లకు చేరిన భక్తులు.. కుటుంబ సమేతంగా సీఎం పవిత్రస్నానం
ABN , Publish Date - Feb 14 , 2025 | 08:46 PM
శుక్రవారం సాయంత్రానికి కల్లా 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా, ఈ ఒక్కరోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ ప్రకటించింది. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రయాగ్‌రాజ్: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళా (Maha Kumbh Mela) సరికొత్త రికార్డులు సృష్టించింది. శుక్రవారం సాయంత్రానికి కల్లా 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా, ఈ ఒక్కరోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో శుక్రవారం పవిత్ర స్నానాలు ఆచరించారు. 50 కోట్ల మందికి భక్తులు చేరడం, అందులో తాము కూడా ఉండటం చాలా సంతోషంగా ఉందని ఫడ్నవిస్ దంపతులు తెలిపారు.
US Deportation Flights: పంజాబ్‌లోనే ఎందుకు? అమెరికా విమానాల ల్యాండింగ్‌పై వివాదం
దేవేంద్ర ఫడ్నవిస్ తన భార్య అమృత, కుమార్తెలు అమృత, దివిజతో కలిసి త్రివేణిసంగంలో పవిత్ర స్నానాలు చేశారు. హారతిలో పాల్గొన్నారు. మహాకుంభ్‌కు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అద్భుతమైన ఏర్పాట్లు చేశారని ఫడ్నవిస్ ప్రశంసించారు. ఇక్కడకు వస్తున్న భక్తులతో సరికొత్త రికార్డు సృష్టించారని, మహాకుంభ్ ఏర్పాట్లు, కోట్లాదిగా తరలి వస్తున్న భక్తజనాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోందని చెప్పారు.
నాసిక్‌లో తదుపరి కుంభ్
అమృతా ఫడ్నవిస్ మాట్లాడుతూ, మహాకుంభలో పాల్గొన్న 50 కోట్ల మందిలో తాము కూడా ఉండటం చాలా సంతోషంగా ఉందని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలని అన్నారు. తదుపురి కుంభ్‌ను నాసిక్‌లో అత్యంత గ్రాండ్‌గా జరిపేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.