Share News

US Deportation Flights: పంజాబ్‌లోనే ఎందుకు? అమెరికా విమానాల ల్యాండింగ్‌పై వివాదం

ABN , Publish Date - Feb 14 , 2025 | 07:42 PM

అమెరికా విమానాల డెస్టినేషన్‌గా పంజాబ్‌ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

US Deportation Flights: పంజాబ్‌లోనే ఎందుకు? అమెరికా విమానాల ల్యాండింగ్‌పై వివాదం

న్యూఢిల్లీ: అక్రమంగా అమెరికా వెళ్లిన భారతీయులతో వస్తున్న యూఎస్ విమానాల ల్యాండింగ్ స్పాట్‌గా పంజాబ్‌ (Punjab)ను ఎంచుకోవడంపై రాజకీయ వివాదం మొదలైంది. 104 మందితో ఇప్పటికే మొదటి విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ కాగా, సుమారు 200 మంది భారతీయులతో మరో రెండు విమానాలు ఈనెల 15, 16 తేదీల్లో అమృత్‌సర్ చేరుకోనున్నాయి. దీనిపై పంజాబ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా విమానాల డెస్టినేషన్‌గా పంజాబ్‌ను కేంద్రం ఎంచుకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారంనాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

Ranveer Allahbadia: సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ అల్హాబాదియా


అప్రతిష్టపాలు చేసేందుకే..

అమెరికాలోని అక్రమ వలసదారులతో వస్తున్న యూఎస్ విమానాలను పంజాబ్‌లో దించడం వెనుక కేంద్రం ఉద్దేశాన్ని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా తప్పుపట్టారు. దీనికి వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. ''అమెరికా నుంచి వచ్చే విమానాలు అమృత్‌సర్‌లో ల్యాండ్ చేయడం ద్వారా పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయాలని కేంద్రం చేస్తోంది. హర్యానాలోనో, గుజరాత్‌లోనే ఆ విమానాలను ఎందుకు దించకూడదు? పంజాబ్‌ను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. పంజాబ్‌కు బదులు అహ్మదాబాద్‌లో విమానాలను ల్యాండ్ చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ సైతం ఇదే తరహాలో ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌లో రిపీట్‌గా విమానాలు ల్యాండ్ అవుతుండటం దురదృష్టకరమని అన్నారు. ''అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన వారిలో పంజాబీయులు కూడా ఉన్నారు. అంతమాత్రాన ఇతర రాష్ట్రాల్లో ల్యాండింగ్ చేయకూడదా? యువతను వెనక్కి అప్పగించేటప్పుడు సంకెళ్లు, చైన్‌లతో తీసుకువస్తు్న్నారనే అంశాన్ని అమెరికా పర్యటనలో ఉన్న మోదీ అక్కడి ప్రభుత్వం దృష్టికి తేవాలి'' అని అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు కన్వర్ సంధు మాట్లాడుతూ, కేంద్ర నిర్ణయం వెనుక లాజిక్ ఏమిటని ప్రశ్నించారు. వెనక్కి తెస్తున్న వారిలో కేవలం పంజాబ్ వాళ్లే కాకుండా పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని అన్నారు. విమానాలను ఢిల్లీలో ల్యాండ్ చేయడం పద్ధతిగా ఉంటుందన్నారు.


తిప్పికొట్టిన బీజేపీ

కాగా, పంజాబ్ నేతలు కొందరు చేస్తు్న్న విమర్శల్లో అర్ధం లేదని బీజేపీ పంజాబ్ చీఫ్ సునీల్ జాఖడ్ అన్నారు. వెనక్కి పంపుతున్న వారంతా భారతీయులేనని, అమృత్‌సర్‌లో ల్యాండ్ అవడం అనేది ఏమంత విషయం కాదని చెప్పారు. దీనిని రాజకీయం చేయడం బదులు అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు ప్రజలు ఎందుకు రిస్క్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. డిపోర్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరును ట్రంప్‌తో మోదీ చర్చించి ఉంటారని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2025 | 07:46 PM