Maha Kumbh Mela: నేటితో ముగియనున్న కుంభమేళ.. శివ నామస్మరణతో మార్మోగిన ప్రయాగ్ రాజ్
ABN , Publish Date - Feb 26 , 2025 | 09:37 PM
Maha Kumbh Mela: ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ.. మహాశివరాత్రి రోజు ముగియనుంది. చివరి రోజు కావడంతో.. దాదాపు రెండు కోట్ల మంది బుధవారం ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. చివరి రోజు శివరాత్రి కావడంతో ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగింది.

లక్నో, ఫిబ్రవరి 26: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ పుష్య పౌర్ణమి నాడు ప్రారంభమైన మహా కుంభమేళ.. ఫిబ్రవరి 26వ తేదీ మహా శివరాత్రి పర్వదినం వేళ ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు.. సాగిన ఈ మహా కుంభమేళకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చి పుణ్య స్నానాన్ని ఆచరించారు. నెలన్నర పాటు సాగిన ఈ కుంభమేళలో దాదాపు 65 కోట్ల మంది పాల్గొన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చివరి రోజు అంటే.. ఫిబ్రవరి 26వ తేదీ త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచారించేందుకు దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. శివ నామ స్మరణతో కుంభమేళ జరుగుతోన్న ప్రాంతం మార్మోగింది.
Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది
ఇక పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులపై యోగి ప్రభుత్వం హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించింది. మరోవైపు ఈ మహాకుంభమేళకు హాజరైన భక్తులు, అయోధ్యలోని శ్రీరామాలయాన్ని సందర్శిస్తున్నారు. అలాగే వారణాసిలో కొలువు తీరిన కాశీ విశ్వేశ్వరుడిని సైతం వారు దర్శించుకొంటున్నారు. ఇంకోవైపు.. అయోధ్యలో శ్రీరాముడిని ఈ 52 రోజుల్లో 16 కోట్ల మంది దర్శించుకున్నారని సీఎం యోగి ఆదిత్య నాథ్ వెల్లడించారు.
Also Read: ఎంపీ స్థానాల పునర్విభజనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఇక ఈ మహాకుంభమేళ చివరి రోజు 20 క్వింటాళ్ల పూలను హెలికాఫ్టర్ల ద్వారా భక్తులపై చల్లారు. ఈ మహాకుంభమేళకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు ప్రముఖులు సైతం హాజరయ్యారు. దాదాపు 50 వేల మంది పోలీసులు.. ఈ కుంభమేళలో విధులు నిర్వహించారు.
Also Read: Lord Shiva: కొమ్ముల మధ్య నుంచి శివుడిని ఎందుకు దర్శించుకొంటారు
Also Read: వంకాయ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఇక జనవరి 30వ తేదీ మౌని అమావాస్య సందర్భంగా ఈ మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అధికారికంగా పదులు సంఖ్యలో భక్తులు మరణించారని.. అదే సంఖ్యలో పలువురు గాయపడ్డారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో ఈ మహాకుంభమేళకు వెళ్లేందుకు భక్తులు రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. ఆ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో సైతం పలువురు మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. 144 ఏళ్లకు ఒక సారి వచ్చే ఈ కుంభమేళకు విదేశాల్లో స్థిర పడిన భారతీయుులు సైతం తరలి వచ్చారు.
For National News And Telugu News