Share News

Mahakumbh Stampede: తొక్కిసలాటపై జ్యుడిషియల్ కమిటీ, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Jan 29 , 2025 | 08:21 PM

మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Mahakumbh Stampede: తొక్కిసలాటపై జ్యుడిషియల్ కమిటీ, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

ప్రయాగ్‌రాజ్: మహాకుంభ్‌ మేళాలో మౌని అమావాస్య పవిత్ర స్నానాల సందర్భంగా తెల్లవారుజాము చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాటలో 30 మంది మృతిచెందగా, 36 మంది గాయపడినట్టు యూపీ పోలీసలు అధికారికంగా ప్రకటించారు.

Mahakumbh Stampede: మహాకుంభ్ తొక్కిసలాటపై అధికారిక ప్రకటన.. మృతుల సంఖ్య ఎంతంటే


త్రిసభ్య జ్యుడిషియల్ కమిషన్ : యోగి

మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ''ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. జస్టిస్ హర్ష్ కుమార్ సారథ్యంలో కమిషన్ దర్యాప్తు జరుపుతుంది. మాజీ డీజీ వీకే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ డీకే సింగ్ సభ్యులుగా ఉంటారు'' అని సీఎం తెలిపారు. సీఎం కంట్రోల్ రూమ్, చీఫ్ సెక్రటరీ కంట్రోల్ రూప్, డీజీపీ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నామని, తీసుకోవాల్సిన చర్యలపై వరుస సమావేశాలు జరపడంతో పాటు సంబంధిత అధికారులకు అదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రధాన మంత్రి, హోం మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రైల్వే మంత్రి, గవర్నర్, ఇతరుల నుంచి అవసరమైన మార్గదర్శకాలు తమకు అందినట్టు యోగి ఆదిత్యనాథ్ వివరించారు.


తొక్కిసలాట ఘటనపై డీఐజీ

ఘటనపై మహాకుంభ్‌నగర్ డీఐజీ వైభవ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, మహాకుంభ్ తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తెల్లవారుజామున 1-2 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని తెలిపారు. మృతుల్లో 25 మంది గుర్తించామని, మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందని వివరించారు. మృతుల్లో ఇతర రాష్ట్రాలు వారు కూడా ఉన్నారని, నలుగురు కర్ణాటక, ఒకరు అస్సాం, ఒకరు గుజరాత్‌కు చెందిన వారున్నట్టు చెప్పారు. గాయపడిన 36 మంది స్థానిక మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం హెల్ప్‌లైన్ నెంబర్ 1920 అందుబాటులో ఉందని చెప్పారు. అఖాడా ప్రాంతానికి భక్తులు పెద్దఎత్తున రావడం, కొందరు తమ వంతు వచ్చేంతవరకూ వేచిచూసేందుకు అక్కడే పడుకోవడం, వారి మీద నుంచి భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు.


ఇవి కూడా చదవండి..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా తొక్కిసలాటపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 08:21 PM