Share News

Gova Fire Accident: థాయ్‌లాండ్‌లో లూథ్రా సోదరుల అరెస్ట్.. త్వరలోనే భారత్‌కు తరలింపు.!

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:07 PM

గోవా నైట్‌క్లబ్ ప్రమాదానికి కారకులైన లూథ్రా సోదరులు తాజాగా అరెస్ట్ అయ్యారు. థాయ్‌లాండ్‌లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Gova Fire Accident: థాయ్‌లాండ్‌లో లూథ్రా సోదరుల అరెస్ట్.. త్వరలోనే భారత్‌కు తరలింపు.!
Luthra Brothers arrested in Thailand

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోవా నైట్‌క్లబ్‌(Gova Night Club)లో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించి 25 మంది మృతికి కారణమైన.. ఆ క్లబ్ యజమానులు అరెస్ట్ అయ్యారు. ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే ఓనర్లు సౌరభ్ లూథ్రా(Saurabh Luthra), గౌరవ్ లూథ్రా(Gaurav Luthra) సోదరులు విదేశాలకు తరలివెళ్లారు. పరారీలో ఉన్న వారిని తాజాగా థాయ్‌లాండ్‌(Thailand)లో అదుపులోకి తీసుకున్నారు అక్కడి అధికారులు.


ఈనెల 6న రాత్రి 'బిర్క్ బై రోమియో లేన్ క్లబ్‌(Birch by Romeo Lane club)'లో ఈ ప్రమాదం జరగ్గా.. కొన్ని గంటలకే నిందితులైన లూథ్రా సోదరులు పరారయ్యారు. డిసెంబర్ 7న తెల్లవారుజామున 5:30 గంటలకు థాయిలాండ్‌లోని పుకెట్ వెళ్లే ఇండిగో ఫ్లైట్ ఎక్కి విదేశాలకు పారిపోయినట్టు తేలింది. దీంతో గాలింపు చర్యల్లో భాగంగా వారిపై లుక్‌అవుట్ నోటీసులు(Look-Out Circular) జారీచేశారు అధికారులు. ఈ నేపథ్యంలో వారి పాస్‌పోర్టు(Passort)లు సస్పెండ్ చేశారు అధికారులు. కాబట్టి వారు చట్టం ప్రకారం ఆ దేశంలో ఉండటానికి అనర్హులు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అరెస్టైన లూథ్రా సోదరులను త్వరలోనే భారత్‌కు తరలించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం గోవాకు చెందిన పోలీస్ బృందం థాయ్‌లాండ్‌కు వెళ్లనుంది.

Luthra Brothers arrested.jpg


అంతకముందు.. అరెస్ట్‌కు భయపడి లూథ్రా సోదరులు ఇండియాకు తిరిగి వచ్చేందుకు నిరాకరించారు. ఈ విషయమై ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీలోని రోహిణీ కోర్టును కూడా ఆశ్రయించారు. తాము థాయ్‌లాండ్‌కు వెళ్లింది తప్పించుకోవడానికి కాదని, వ్యాపార పనుల నిమిత్తం మాత్రమేనని పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

ఓటుచోరీ గురించి మాట్లాడమంటే అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారు: రాహుల్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్‌కు స్పెషల్ ట్రైన్స్..

Updated Date - Dec 11 , 2025 | 05:10 PM