Share News

Parliament Winter Session 2025: విపక్షాల ఆందోళన.. లోక్‌సభ మళ్లీ వాయిదా

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:32 AM

విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.

Parliament Winter Session 2025: విపక్షాల ఆందోళన.. లోక్‌సభ మళ్లీ వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 01: లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ప్రారంభమైన లోక్‌సభ వరుసగా రెండు సార్లు వాయిదా పడింది. ఈ అంశాలు.. సర్ (SIR), ఢిల్లీ బాంబు పేలుళ్లు, ఢిల్లీలో కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనంటూ వారంతా పట్టు పట్టారు. దీంతో మధ్యాహ్నం 2.00 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.


అయితే ముందుగా తాము ప్రతిపాదించిన సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని విపక్షాలకు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ విపక్షాలకు ఆయన సూచించారు. కానీ విపక్ష సభ్యులు మాత్రం ముందుగా తాము ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దీంతో విపక్ష ఎంపీల తీరుతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం చెందారు. ఈ సభను మధ్యాహ్నం 12.00 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో సైతం విపక్ష ఎంపీ తీరు అదే విధంగా ఉండడంతో.. తిరిగి సభను మధ్యాహ్నం 2.00 గంటలకు మరోసారి స్పీకర్ వాయిదా వేశారు.


మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ప్రతిపక్షాలు బయటకు రాలేదంటూ ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని ప్రియాంక పేర్కొన్నారు. SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ కేంద్రంపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్‌లో వీక్షించండి

తమిళనాట భారీ వర్షాలు.. ఆరుగురి మృతి

For More National News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 01:50 PM