Political And Development issues: కర్ణాటక సీఎంతో కిరణ్ మజుందార్ భేటీ
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:49 AM
బెంగళూరులో గుంతల రహదారులు, చెత్త సమస్యపై ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన బయోకాన్ కంపెనీ సీఎండీ....
బెంగళూరు అభివృద్ధికి సహకరిస్తామని హామీ
బెంగళూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో గుంతల రహదారులు, చెత్త సమస్యపై ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన బయోకాన్ కంపెనీ సీఎండీ కిరణ్ మజుందార్ షా.. మంగళవారం కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో భేటీ అయ్యారు. సీఎం అధికారిక నివాసం కావేరికి వెళ్లిన ఆమె సిద్దరామయ్యకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నగర సమస్యలపై చర్చించారు. అనంతరం ఆమె సదాశివనగర్‌లోని డీసీఎం డీకే శివకుమార్ నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. బెంగళూరు అభివృద్ధికి సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారని డీకే శివకుమార్ విలేకరులకు చెప్పారు. బెంగళూరు ప్రగతి, ఆధునికీకరణ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆమెతో చర్చలు జరిగాయన్నారు. నగర సమస్యలపైనా ఆమె ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని, వాటిపైనే అభిప్రాయాలు తెలిపారని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా, కిరణ్ మజుందార్ గుజరాత్‌కు చెందినవారని, అందుకే బెంగళూరుపై విమర్శలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘నేను ఈ గడ్డపై పుట్టిన ఆడ బిడ్డను. బెంగళూరులోనే పుట్టాను. నా నగరంలో ఉండటం నాకు గర్వకారణం’ అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.