Share News

Delhi: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:46 PM

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేంద్ర మంత్రివర్గం మంగళవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్‌లోని కోటాకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ మంజూరు చేయడం సహా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

Delhi: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
Union Cabinet

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేంద్ర మంత్రివర్గం మంగళవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్‌లోని కోటాకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ మంజూరు చేయడం సహా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు..

  • రాజస్థాన్‌లోని కోటాకు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు మంజూరు.

  • రూ.1,507 కోట్లతో కోటాలో కొత్త ఎయిర్‌పోర్టుకు ఆమోదం.

  • కటక్-భువనేశ్వర్ మధ్య 6 లైన్ల రింగ్‌రోడ్డుకు ఆమోదం.

  • రింగ్‌రోడ్డుకు రూ.8,307 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం.

  • ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్‌లోని కోటా-బుండి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని రూ. 1507.00 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇచ్చిన ప్రతిపాదనను ఆమోదించింది. చంబల్ నది ఒడ్డున ఉన్న కోట.. రాజస్థాన్ పారిశ్రామిక రాజధానిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా, కోట నేషనల్ ఎడ్యుకేషన్ కోచింగ్ హబ్‌గానూ ప్రసిద్ధి చెందింది.


అధికారిక ప్రకటన ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వం A-321 మోడల్ విమానాల నిర్వహణకు అనువైన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధి కోసం 440.06 హెక్టార్ల భూమిని AAIకి బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1000 పీక్ అవర్ ప్యాసింజర్లను (PHP) నిర్వహించగల సామర్థ్యం గల టెర్మినల్ భవనం నిర్మాణం, వార్షికంగా 2 మిలియన్ల మంది ప్రయాణీకుల సామర్థ్యం (MPPA), 3200 మీటర్ల x 45 మీటర్ల రన్‌వే 11/29, A-321 మోడల్ విమానాల కోసం 7 పార్కింగ్ బే లతో కూడిన ఆప్రాన్, రెండు లింక్ టాక్సీవేలు, ATC కమ్ టెక్నికల్ బ్లాక్, ఫైర్ స్టేషన్, కార్ పార్క్, అనుబంధ పనులు చేపట్టనున్నారు.


Also Read:

ఆసియా కప్‌కు టీమిండియా జట్టు ఇదే..

అలా అయితే నా ఇల్లు రాసిస్తా: పెద్దారెడ్డి సవాల్

For More National News and Telugu News..

Updated Date - Aug 19 , 2025 | 03:59 PM