Tadipatri Politics: తాడిపత్రి అరాచకాలపై సిట్‌తో విచారణ జరపాలి: పెద్దారెడ్డి
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:05 PM
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయ మరోసారి వేడెక్కింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. ఆ క్రమంలో జేసీకి పెద్దారెడ్డి సవాల్ విసిరారు.
అనంతపురం, ఆగస్టు 19: పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. తాడిపత్రికి వెళ్లాలంటే వీసా కావాలా? అని ప్రశ్నించారు. తాడిపత్రి వెళ్లాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. అందుకోసం.. పోలీసులు చెబితే తాను దరఖాస్తు చేస్తానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై పోలీసులు ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని చెప్పారు.
ఆ క్రమంలో తాను ఎక్కడికి వెళ్లినా.. పోలీసులు తన వెంట పడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి పోలీసుల వైఖరి ఏకపక్షంగా ఉందని విమర్శించారు. తాడిపత్రిలో వైసీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడులు చేస్తున్నా... పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలంటూ ఈ సందర్భంగా కేతిరెడ్డి సవాల్ విసిరారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలు గొప్పతనం అనుకుంటున్నారా? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పెద్దారెడ్డిని సూటిగా ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేతిలో పోలీసు అధికారులు బందీ అయ్యారంటూ నిప్పులు చెరిగారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా... తనను తాడిపత్రిలోకి అనుమతించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రి అరాచకాలపై సిట్ విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తద్వారా తాడిపత్రిలో తాను దౌర్జన్యం చేశానో... జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకం చేశారో తేలుతుందని స్పష్టం చేశారు.
తాడిపత్రి ప్రజలు నిజంగా నన్ను అడ్డుకుంటే తన ఇల్లు రాసిస్తానంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. పోలీసుల అండతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతలు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆందోళన చెందారు. ప్రజల నుంచి అక్రమ వసూళ్లు చేయడం మానుకోమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆయన హితవు పలికారు. తాడిపత్రి నియోజకవర్గంలో తనకు 80 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. దీంతో తాడిపత్రి ప్రజలు తనను వ్యతిరేకించటం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీడని మిస్టరీ.. జల్లెడ పడుతున్న పోలీసులు
యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..
Read Latest AP News and National News