Nirmala Sitharaman: నాలుగు స్లాబ్‌లు బీజేపీ నిర్ణయం కాదు.. విపక్షాలపై నిర్మలా సీతారామన్ విసుర్లు
ABN , Publish Date - Sep 06 , 2025 | 09:00 PM
నాలుగు టాక్స్ స్లాబ్ రేట్లపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు కేంద్రంపై విమర్శలు సాగిస్తూ వచ్చాయి. అయితే గత బుధవారంనాడు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ రెండు టాక్స్ స్లాబ్ రేట్లకు ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను (GST) సంస్కరణలపై విపక్షాలు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. జీఎస్‌టీని ప్రవేశపెట్టినప్పుడు నాలుగు స్లాబులు ఉండాలని తీసుకున్న నిర్ణయం బీజేపీదో, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీదో కాదని, రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారతా కమిటీ తీసుకున్న నిర్ణయమని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ మంత్రులు కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికారతా కమిటీలో ఉన్నారని, ఆ విషయం విపక్షాలకు తెలియకపోవడం ఏమిటని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. తాను చెప్పినది తప్పని విపక్ష నాయకులు నిరూపిస్తే తాను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధమైనని అన్నారు. 'నాకు ఎలాంటి భేషజాలు (ఇగో) లేవు. నేను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధమే. కానీ, వాళ్లు అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. విషయంపై మీకు అవగహన లేకపోతే కనీసం మౌనంగానైనా ఉండండి' అని నిర్మలా సీతారామన్ అన్నారు.
రెండు టాక్స్ స్లాబ్ రేట్లకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం
నాలుగు టాక్స్ స్లాబ్ రేట్లపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు కేంద్రంపై విమర్శలు సాగిస్తూ వచ్చాయి. అయితే గత బుధవారంనాడు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ రెండు టాక్స్ స్లాబ్ రేట్లకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి ఇది అమల్లోకి రానుంది. గతంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా నాలుగు జీఎస్‌టీ స్లాబ్‌లు ఉండగా, కౌన్సిల్ ఇప్పుడు 12 శాతం, 28 శాతం స్లాబ్‌లు తొలగించింది. కానీ, లగ్జరీ, సిన్ ప్రోడెక్ట్‌లకు కొత్తగా 40 శాతం స్లాబ్ తీసుకువచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కి మోదీ ఫోన్
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
For More National News And Telugu News