Share News

Karnataka Caste Census: కర్ణాటకలో మళ్లీ కొత్తగా కులగణన.. సిద్ధరామయ్య ప్రకటన

ABN , Publish Date - Sep 12 , 2025 | 06:02 PM

కర్ణాటకలోని 7 కోట్ల ప్రజానీకం సామాజిక, విదాస్థితిని ఈ సర్వే తెలయజేయనుందని మీడియాతో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇందుకోసం 1,75,000 మంది టీచర్లు పనిచేస్తారని, ఒక్కొక్కరికి రూ.20,000 వరకూ పారితోషిక అందుతుందని తెప్పారు.

Karnataka Caste Census: కర్ణాటకలో మళ్లీ కొత్తగా కులగణన.. సిద్ధరామయ్య ప్రకటన
Siddaramaiah

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో మళ్లీ కొత్తగా కులగణన (Caste Census) చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) శుక్రవారంనాడు ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7వ తేదీ మధ్య చేపట్టనున్న ఈ కులగణనకు రూ.420 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కులగణనలో 60 ప్రశ్నలు ఉంటాయని, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి శాస్త్రీయంగా నిర్వహించనున్నామని సీఎం తెలిపారు.


'రాష్ట్రంలో సామాజిక, విద్యావిషయక సర్వేను వెనుకబడిన తరగతుల కర్ణాటక రాష్ట్ర కమిషన్ ఈనెల 22 నుంచి అక్టోబర్ 7 వరకూ చేపట్టనుంది. కమిషన్ చైర్మన్ కాంతారాజ్ 2015లో నివేదిక సమర్పించారు. నివేదిక సమర్పించి పదేళ్లయినందున కొత్త సర్వే జరపాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ పనిని శాశ్వత వెనుకబడిన తరగతుల కమిషన్ చేపట్టనుంది' అని సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.


రూ.420 కోట్లు కేటాయింపు

కర్ణాటకలోని 7 కోట్ల ప్రజానీకం సామాజిక, విదాస్థితిని ఈ సర్వే తెలయజేయనుందని మీడియాతో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇందుకోసం 1,75,000 మంది టీచర్లు పనిచేస్తారని, ఒక్కొక్కరికి రూ.20,000 వరకూ పారితోషిక అందుతుందని తెప్పారు. ఇది ఖర్చుతో కూడిన పని అని, మొత్తంగా రూ.420 కోట్లు ఈ ప్రక్రియ కోసం కేటాయించామని, అవసరమైతే మరిన్ని అదనపు నిధులను కేటాయిస్తామని చెప్పారు.


కర్ణాటకలో 2015లో నిర్వహించిన కులగణన సర్వేను పక్కకుపెట్టి కొత్తగా సర్వే జరపాలని గత జూన్ 12న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2015 కులగణన, ఆర్థిక సమాజిక సమీక్షపై రూపొందించిన నివేదికను కర్ణాటక సర్కార్ గతంలో ఆమోదించింది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, పలువర్గాల నుంచి ఆందోళనలు రావడం, కాంగ్రెస్ అధిష్ఠానం సైతం మళ్లీ కులగణన చేపట్టాలని సూచించడంతో కర్ణాటక ప్రభుత్వం మరోసారి కులగణన చేపడుతున్నట్టు ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం.. ఎప్పటి నుంచంటే

మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

For More National News and Telugu News

Updated Date - Sep 12 , 2025 | 06:02 PM