Kamal Hasan: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంకండి
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:15 AM
అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేలా ప్రచారం కూడా చేపట్టాలని ‘మక్కల్ నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ పిలుపునిచ్చారు.
- పార్టీ శ్రేణులకు ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్ పిలుపు
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేలా ప్రచారం కూడా చేపట్టాలని ‘మక్కల్ నీదిమయ్యం’ (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్(Kamal Hasan) పిలుపునిచ్చారు. రాజా అన్నామలైపురంలోని ముత్తమిళ్‌పేరవై టీఎన్ రాజరత్తినం హాలులో గురువారం ఉదయం జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సమావేశంలో చెన్నై జోన్ కార్యదర్శి మయిల్‌వాహనన్ సహా 17 జిల్లాలకు చెందిన కార్యదర్శులు, 26 శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. సాయంత్రం కాంచీపురం జోన్ జిల్లా కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే కూటమిలోనే మక్కల్ నీదిమయ్యం కొనసాగనుందని, ఆ కూటమిని గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు, బూత్‌కమిటీల ఇన్‌ఛార్జులు శాయశక్తులా పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను డీఎంకే అధిష్టానం సూచించే ప్రాంతాల్లో ప్రచారం చేస్తానని,

ఆ పర్యటన వివరాలను కూడా త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేయాల్సిన ప్రచార వ్యూహాలపై కూడా పార్టీ జిల్లా కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం, ఉపాధ్యక్షులు ఏజీ మౌర్యా, ఆర్ తంగవేలు, సెంథిల్ ఆరుముగం, మురళీ అబ్బాస్, యువజన విభాగం కార్యదర్శి కవి స్నేహన్, ఐటీ విభాగ కార్యదర్శి లక్ష్మణ్, మహిళా విభాగం కార్యదర్శి స్నేహా మోహన్‌దా్‌స తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News