Share News

Amit Shah-Jagdeep Dhankhar: జగ్‌దీప్ ధన్‌కఢ్ రాజీనామాపై స్పందించిన హోం మంత్రి అమిత్ షా

ABN , Publish Date - Aug 25 , 2025 | 10:07 AM

ఉపరాష్ట్రపతి పదవికి సీనియర్ నేత జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడం రాజకీయ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందిస్తూ జగ్‌దీప్ రాజీనామాకు ఆరోగ్య కారణాలు మినహా ఇతర అంశాలేవీ లేవని స్పష్టం చేశారు.

Amit Shah-Jagdeep Dhankhar: జగ్‌దీప్ ధన్‌కఢ్ రాజీనామాపై స్పందించిన హోం మంత్రి అమిత్ షా
Amit Shah on Jagdeep Dhankhar Resignation

ఇంటర్నెట్ డెస్క్: ఉపరాష్ట్ర పదవికి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాపై హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన రాజీనామా చేశారని అన్నారు. మరో కారణం ఏదీ లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ నియమానలను అనుసరిస్తూ జగ్‌దీప్ ధన్‌కడ్ గొప్పగా పనిచేశారని కితాబునిచ్చారు. ‘ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి.. పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చక్కగా పని చేశారు’ అని ప్రశంసించారు. ఆయన రాజీనామా గురించి ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.


ఉపరాష్ట్రపతిగా ఉన్న సీనియర్ నేత జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య కారణాలతో జులై 21న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాల తొలి రోజునే ఆయన తన రాజీనామాను సమర్పించారు. ఇక తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల తరపున మాజీ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి తలపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2025 | 11:07 AM