Puri Jagannath chariot wheels: పార్లమెంటు కాంప్లెక్స్‌లో జగన్నాథ రథ చక్రాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:13 PM
లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా పూరీ జగన్నాథ ఆలయాన్ని ఇటీవల దర్శించిన సందర్భంగా పార్లమెంటు ఆవరణలో జగన్నాథ రథ చక్రాలను ఏర్పాటు చేయాలని శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం ఒక ప్రతిపాదన చేసింది.
న్యూఢిల్లీ: ఒడిశా సంస్కృతి, ఆధ్యాత్మక వారసత్వానికి చిహ్నంగా పూరీ జగన్నాథుని రథ చక్రాలను పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా పూరీ జగన్నాథుని ఆలయాన్ని ఇటీవల సందర్శించిన సందర్భంగా పార్లమెంటు ఆవరణలో జగన్నాథ రథ చక్రాలను ఏర్పాటు చేయాలని శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం (SJTA) ఒక ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు ఓం బిర్లా ఆమోదం తెలిపినట్టు అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని ఎస్‌జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పధీ సోషల్ మీడియాలో 'ఎక్స్'లో వెల్లడించారు. లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ ఎంపీ సంబిత్ పాత్ర ఇటీవల శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా తాము చేసిన ప్రతిపాదనకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారని చెప్పారు. పార్లమెంటు ఆవరణలోని ముఖ్యమైన లొకేషన్‌లో జగన్నాథ రథయాత్రకు చెందిన మూడు రథాల నుంచి ఒక్కో చక్రాన్ని ఉంచేందుకు స్వీకర్ అంగీకరించినట్టు చెప్పారు. స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
పూరీలో జగన్నాథుని రథయాత్ర ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. మూడు రథాలపై జగన్నాథుడు, సుభద్ర, బలభద్రులు కొలువుతీరుతాయి. రథయాత్ర ముగిసిన తర్వాత రథాలను భాగాలుగా విడదీస్తారు. చక్రాలతో సహా కొన్ని విడిభాగాలను వేలం వేస్తారు. కొన్ని ముఖ్యమైన విడిభాగాలు మినహా ప్రతి సంవత్సరం కొత్తగా రథాలను తయారు చేస్తారు.
ఇవి కూడా చదవండి..
సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న తేజస్వి.. వేదికపై రాహుల్
చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి