Haryana IPS officer: ఐపీఎస్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఎస్పీపై వేటు
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:45 PM
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. తుపాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ తరుణంలోనే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హర్యానా, అక్టోబర్ 11: హర్యానాలో విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. తుపాకీతో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ తరుణంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాను పదవి నుంచి తొలగిస్తూ అధికారులు వేటు వేశారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో సూసైడ్ నోట్ లో పూరన్ కుమార్ పేర్కొన్న పేర్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై వేటు వేశారు. హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ సహా 8 మంది సీనియర్ అధికారులపై సూసైడ్ నోట్‌లో కుల ఆధారిత వివక్ష, బహిరంగ అవమానాలు, మానసిక వేధింపులు, దౌర్జన్యాలపై సూసైడ్ నోట్‌లో మృతుడు ప్రస్తావించాడు.
పూరన్ ఆత్మహత్యకు పోలీసు అధికారులే కారణమని, సూసైడ్ నోట్ లోనూ ఆయన ఇదే ప్రస్తావించాడని ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో హరియాణా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శత్రుజీత్ సింగ్ కపూర్‌తోపాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లను చేర్చాలంటూ ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే ఎస్పీపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అటు మృతుడి భార్య అమ్నీత్ కుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి పూరన్ సూసైడ్ చేసుకోవడం తనను షాక్‌కు గురిచేసిందని.. ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటానికి కోట్లాది మంది భారతీయులు అండగా ఉన్నారంటూ సోనియా గాంధీ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Nobel Peace Prize for Rahul Gandhi? Congress: రాహుల్‌కు నోబెల్ శాంతి బహుమతి..!: కాంగ్రెస్ నేత
DK Shivakumar: నా సమయం ఎప్పుడొస్తుందో నాకు తెలుసు.. సీఎం ఊహాగానాలపై డీకే