IndiGo Emergency Landing: ఇండిగో విమానంలో ఇంధనం లీక్.. వారణాసిలో అత్యవసర ల్యాండింగ్
ABN , Publish Date - Oct 22 , 2025 | 07:56 PM
ఇంధనం లీక్ కావడంతో ఇండిగో విమానం వారణాసిలో బుధవారం అత్యవసరంగా ల్యాండయ్యింది. ప్రయాణికులు అందరూ సేఫ్‌గా ఉన్నారని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ఇంధనం లీక్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. 166 మంది ప్యాసెంజర్లు ఉన్న 6ఈ-6961 విమానం బుధవారం సాయంత్రం 4.01 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండయ్యింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని చెప్పారు. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయని చెప్పారు (IndiGo Varanasi Airport Emergency Landing).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంధనం లీక్ అవుతున్నట్టు గుర్తించగానే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతిచ్చింది. ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేయడంతో వారు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అత్యవసర ల్యాండింగ్ ఏర్పాటు చేశారు. దీంతో, విమారం సురక్షితంగా దిగింది. ఎయిర్‌పోర్టు అధికారులు, టెక్నికల్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల అనంతరం, విమానం గమ్యస్థానానికి బయలుదేరుతుంది (Fuel Leak in Srinagar Bound IndiGo Flight).
ఇవి కూడా చదవండి:
పశ్చిమబెంగాల్‌లో మరోసారి కలకలం.. అత్యాచారం చేస్తామంటూ మహిళా డాక్టర్‌కు బెదిరింపులు
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి