India-US Trade Deal: భారత్ అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం.. ఎంఈఏ వెల్లడి
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:25 PM
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా తొలి రౌండ్ చర్చలు ముగియడంతో ఎంఈఏ తాజా ప్రకటన చేసింది. భారత్ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన అనంతరం ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి.
న్యూఢిల్లీ: భారత్, అమెరికా దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు (Trade talks) సానుకూల దిశగా సాగాయని, పరస్పరం లబ్ధి చేకూరేలా తదుపరి ద్వైపాక్షిక చర్చల ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఇరుదేశాలు ఆంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారంనాడు తెలిపింది.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా తొలి రౌండ్ చర్చలు ఇటీవల ముగియడంతో ఎంఈఏ తాజా ప్రకటన చేసింది. భారత్ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన అనంతరం ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి.
'అమెరికా ప్రతినిధి బ్రెండెన్ లించ్ నేతృత్వంలోని బృందం వాణిజ్య శాఖ ప్రతినిధి బృందంతో ఈనెల 16న సమావేశమైంది. అమెరికాతో ట్రేడ్ డీల్‌పై జరుగుతున్న చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సమావేశం జరిగింది. సానుకూల దిశగా చర్చలు జరిగాయి. తదుపరి చర్చల కోసం ఎదురచూస్తున్నాం. పరస్పర ప్రయోజనం చేకూరే వాణిజ్య ఒప్పందంపై సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సమావేశంలో నిర్ణయించారు' అని ఎంఈఓ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి