Ravichandran Ashwin: ఐపీఎల్‌కు స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై..
ABN , Publish Date - Aug 27 , 2025 | 11:13 AM
221 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించారు. చివరిగా అశ్విన్ CSK తరఫున IPL టోర్నీ ఆడారు. IPLలో పలు ఫ్రాంచైజీల తరఫున కూడా అశ్విన్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 221 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్, తాజాగా ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోవడంతో.. అతని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ