Operation Sindoor: పాక్ ప్రతిదాడి చేయెచ్చు, అప్రమత్తంగా ఉండాలి: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ థిల్లాన్
ABN , Publish Date - May 07 , 2025 | 07:46 PM
గత సైనిక ఆపరేషన్లతో పోల్చుకుంటే ఈసారి సైనికి ఆపరేషన్ భిన్నమైనదని, ఈసారి సైన్యం నిర్దేశించిన దాడుల లక్ష్యాలు మరింత విస్తారంగా, లోతుగా ఉన్నాయని అన్నారు. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో అత్యంత సమర్ధవంతంగా, ప్రభావవంతంగా దాడులు నిర్వహించాయని కేజేఎస్ థిల్లాన్ ప్రశంసించారు.
న్యూఢిల్లీ: పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ లక్షిత దాడులు నేపథ్యంలో పాక్ ప్రతిదాడులు చేసే అవకాశాలను కొట్టివేయలేమని ఇండియన్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ (KJS Dhillon) ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. పహల్గాం దాడికి ప్రతిగానే సైన్యం ''ఆపరేషన్ సింధూర్'' (Operation Sindoor) నిర్వహించిందని, అయితే మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని చెప్పారు.
Rajnath Singh: అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టాం.. రక్షణ మంత్రి
''హహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. కానీ, మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. పాక్ ప్రతిదాడికి ప్రయత్నించొచ్చు. అయితే వారి దాడి భారత పౌరులకు ప్రమాదకరం కాకపోవచ్చు, అయితే వాళ్లు (పాక్) మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని థిల్లాన్ విశ్లేషించారు. పహల్గాం దాడికి బాధ్యులైన వారిపై మాత్రమే సైన్యం దాడులు జరిగాయని, పౌర, సైనిక స్థావరాలపై దాడులు చేయలేదని చెప్పారు. కేవలం టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేయడంపైనే సైన్యం దృష్టిపెట్టిందన్నారు.
గతానికి ఇప్పటికీ తేడా ఉంది..
గత సైనిక ఆపరేషన్లతో పోల్చుకుంటే ఈసారి సైనికి ఆపరేషన్ భిన్నమైనదని, ఈసారి సైన్యం నిర్దేశించిన దాడుల లక్ష్యాలు మరింత విస్తారంగా, లోతుగా ఉన్నాయని అన్నారు. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో అత్యంత సమర్ధవంతంగా, ప్రభావవంతంగా దాడులు నిర్వహించాయని ప్రశంసించారు.
ఇవాళ ప్రపంచ ముందు రెండురకాల ముప్పు పొంచి ఉందని, ఒకటి ఉగ్రవాదం, మరొకటి అణ్వాయుధాలని థిల్లాన్ అన్నారు. బాధ్యతలేని వారి చేతులో అణ్వాయుధాలున్నాయని చెప్పారు. పాకిస్థాన్ వల్ల ఎప్పుడూ అలాంటి ప్రమాదం ఉంటుందన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆతని తదుపరి చర్య ఏమిటో ఊహించడం కూడా కష్టమని, ఆయన మైండ్ సెంట్ సెట్‌ను బట్టి ఉండొచ్చని అన్నారు. భూప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాదం ఉండకూడదని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమని, ఆ ప్రకారం బహవల్‌పూర్ నుంచి ముజఫరాబాద్ వరకూ ఉగ్రవాదంపై పంజా విసిరామని, ఎక్కడా టెర్రరిస్టు క్యాంపులు సురక్షితం కావనే సందేశాన్ని పంపామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: వ్యోమికా, ఖురేషీ గురించి ఈ విషయాలు తెలుసా
Operation Sindoor: భారత్ సైనిక దాడులపై పాక్ రక్షణ మంత్రి ఏమన్నారంటే
ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా