Share News

India Diplomatic Mission: ఇండియా డిప్లొమాటిక్ దౌత్య యాత్ర ప్రారంభం..ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలకు బలమైన సందేశం

ABN , Publish Date - May 21 , 2025 | 11:30 AM

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ గట్టిగా తన నిర్బంధమైన వైఖరిని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ దేశాల సపోర్ట్ కోరేందుకు భారత ప్రభుత్వం ఓ గ్లోబల్ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని (India Diplomatic Mission) ప్రారంభించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

India Diplomatic Mission: ఇండియా డిప్లొమాటిక్ దౌత్య యాత్ర ప్రారంభం..ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలకు బలమైన సందేశం
India diplomatic mission 2025

ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఏకతాటిపై ఉన్న వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక గ్లోబల్ అవుట్‌రీచ్ (India Diplomatic Mission) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత పార్లమెంటు నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు ఉన్న ఏడు బృందాలు ప్రపంచంలోని దాదాపు 33 దేశాలకు పర్యటించనున్నాయి. ఈ బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలతో పాటు ఇతర ప్రాధాన్యత గల దేశాలకు కూడా భారత ఉగ్రవాద వ్యతిరేక వైఖరి గురించి వివరించనున్నాయి.


దేశాల ఎంపికపై వివరాలు

మంగళవారం జరిగిన బ్రీఫింగ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ 33 దేశాల ఎంపికపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఎంపీ అపరాజితా సరంగి ప్రకారం, ఈ జాబితాలో దాదాపు 15 దేశాలు భద్రతా మండలి (UNSC) సభ్య దేశాలు కాగా, మరో ఐదు దేశాలు భవిష్యత్తులో UNSC సభ్యదేశాలుగా ఉండబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, అంతర్జాతీయంగా మంచి ప్రభావం కలిగిన కొన్ని ఇతర దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. అపరాజితా సరంగి జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని బృందంలో భాగంగా ఉన్నారు. ఈ బృందం ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలకు పర్యటించనుంది. ఇవాళ ఉదయం 11:30కు జపాన్ దేశానికి బయలుదేరే ఈ బృందం, మొదటి ఔట్‌రీచ్ ట్రిప్‌ను ప్రారంభిస్తోంది.


పాకిస్థాన్ వ్యతిరేకంగా సందేశం

ప్రస్తుతం పాకిస్థాన్ భద్రతా మండలి రొటేటింగ్ మెంబర్‌గా ఉండగా, మరో 17 నెలల పాటు అదే స్థితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన వాదనలను ప్రపంచానికి వినిపించేందుకు ప్రయత్నించనుందని అపరాజితా సరంగి హెచ్చరించారు. అందుకే భారత్ అంతర్జాతీయంగా ముందడుగు వేసి తమ వాదనను నిష్పక్షపాతంగా తెలియజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విభిన్న పార్టీలకు చెందిన ఎంపీలు కలిసి ఈ దేశాలకు వెళ్లి భారత దృక్కోణాన్ని అక్కడి ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్ఖాన్ వైఖరిని ఖండించాలని, ఇది మనందరి బాధ్యత అని భువనేశ్వర్ ఎంపీ అపరాజితా సరంగి పేర్కొన్నారు.


ఆపరేషన్ సిందూర్ నేపథ్యంగా

ఈ గ్లోబల్ అవుట్‌ రీచ్ కార్యక్రమానికి ప్రధాన కారణం ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎటాక్. ఈ ఆపరేషన్‌లో భారత బలగాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ చర్యలతో భారత వైఖరి ఉగ్రవాదంపై ఎలా ఉందన్న దానిపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.

ఏడు బృందాల సమాచారం

ఈ ఏడూ బృందాలకు నేతృత్వం వహించేవారిలో శశి థరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), సుప్రియా సూలే (ఎన్‌సీపీ), శ్రికాంత్ ఏకనాథ్ శిండే (శివసేన), కనిమొళి (డీఎంకే) ఉన్నారు.


ఇవీ చదవండి:

Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ఇవే టాప్ 5 ప్రాఫిట్ స్టాక్స్


Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 11:32 AM