Share News

India-Pak War: క్షిపణుల వర్షం కురిస్తే.. మాజీ దౌత్యవేత్త ఏమన్నారంటే

ABN , Publish Date - May 04 , 2025 | 05:34 PM

పహల్గాం దాడి అనంతరం పాక్‌పై దెబ్బకు దెబ్బ తీయాలనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. భారత్ సైతం పాక్‌పై వరుస కఠిన చర్యలు తీసుకుంటోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

India-Pak War: క్షిపణుల వర్షం కురిస్తే.. మాజీ దౌత్యవేత్త ఏమన్నారంటే

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ దుశ్చర్యపై భారత ప్రజానీకంలో తీవ్ర భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. భారత్ సైతం పాక్‌పై వరుస కఠిన చర్యలు తీసుకుంటోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల భావోద్వేగ స్థితి ఒక్కటే యుద్ధాన్ని నిర్దేశించడానికి సరిపోతుందా అనే దానిపై నిపుణులు ఏమంటున్నారు? 2017-2023 మధ్య పాకిస్థాన్‌కు భారత హైకమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసరియా (Ajay Bisaria) దీనిపై కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రజల మానసిక స్థితి నిర్దిశించకూడదని అన్నారు. ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆధారంగా యుద్ధం టైమింగ్ ఉండకూడదని చెప్పారు.

Pahalgam Attck Aftermath: ఆర్డినెన్స్ కంపెనీల్లో ఉద్యోగుల లీవులు రద్దు


war.jpg

ఆపరేషన్ విజయవంతం కావాలంటే..

ఏ ఆపరేషన్ విజయంవంతం కావాలన్నా మూడు అంశాలు ముఖ్యమని, స్పీడ్ (వేగం), సర్‌ప్రైజ్(అనూహ్యం), సీక్రెసీ (గోప్యత) అనేవి చాలా ముఖ్యమని బిసారియా చెప్పారు. యుద్ధమే అనివార్యమైతే సొంతంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ''సొంత నిర్ణయంతోనే యుద్ధం చేయాలి. అప్పుడు ఎంత తీవ్ర పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి వస్తుంది, అదుపుతప్పితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందుకు తగిన సామర్థ్యం, పట్టుదల, రాజకీయ సంకల్పం, జాతి సంకల్పం కావాలి'' అని ఆయన విశ్లేషించారు.


attack.jpg

భారీ మూల్యం ఉండొచ్చు..

కాగా, యుద్ధం వల్ల మూల్యం కూడా భారీగానే ఉండవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సరీన్ హెచ్చరించారు. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు క్షిపణులతో దాడికి దిగే పరిస్థితి ఏర్పిడితే అది ఆయా దేశాల్లోని నగరాలపై ప్రభావం చూపుతుందన్నారు. నగరాలపై క్షిపణుల వర్షం కురిస్తే అటు ఇస్లామాబాద్, లాహార్‌పై, ఇటు ఢిల్లీపై ఆ ప్రభావం పడుతుందన్నారు.


భారత్‌కు భాగస్వామిగా ఉన్న రష్యా ఇలాంటి సమయంలో బాసటగా నిలిచే అవకాశంపై అడిగినప్పుడు రష్యా అలాంటి ఫేవర్‌ చేయదని సుశాంత్ సరీన్ విశ్లేషించారు. రేపటి రోజున చైనాతో జగడం ఏదైనా వచ్చినప్పుడు రష్యా మనతో వస్తుందనుకుంటున్నారా? ఒక వర్గం మాత్రమే అవుననే అభిప్రాయంతో ఉందని ఆయన చెప్పారు. పాకిస్థాన్ విషయంలోనే వాళ్లు (రష్యా) మనతోటి రానప్పుడు చైనా విషయంలో ఎందుకు వస్తారన్నదే తన ప్రశ్న అని ఆయన అన్నారు. పాక్ యూట్యూబె ఛానెళ్ల ప్రసారాలను భారత్‌లో నిలిపివేయడంపై అడిగినప్పుడు ఆ నిర్ణయంతో ఆయన ఏకీభవించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే భారత్‌లో ప్రసారాలపై సమస్యేమీ లేదని, అయితే ఇప్పటి ఆసాధారణ పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాలు తప్పవని, లేదంటే మన మార్కెట్‌ను ఉపయోగించుకుని విష పూరిత ప్రచారం సాగించే అవకాశం వారికి ఉంటుందని సరీన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 05:37 PM