Siddaramaiah: ఐదేళ్లూ నేనే... సిద్ధరామయ్య నోట మళ్లీ అదేమాట
ABN , Publish Date - Oct 01 , 2025 | 08:13 PM
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాయకత్వ సమస్య పార్టీని ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ల మధ్య చెరో రెండున్నరేళ్లు పాలన చేపట్టేందుకు రహస్య ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వంపై చర్చ కొనసాగుతోంది. అయితే ఐదేళ్ల పదవీకాలానికి తానే సీఎంగా కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోసారి స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు కుణిగల్ ఎమ్మెల్యే సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇటీవల డిమాండ్ చేశారు. దీనిపై మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను మీడియా అడిగినప్పుడు తానే ఐదేళ్లు సీఎంగా ఉంటానని చెప్పారు.
'వచ్చే ఏడాది కూడా మైసూరులో పుష్పార్చన చేస్తాననే నమ్మకం ఉంది. అయితే, పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను' అని సిద్ధరామయ్య తెలిపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాయకత్వ సమస్య పార్టీని ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ల మధ్య చెరో రెండున్నరేళ్లు పాలన చేపట్టేందుకు రహస్య ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. సిద్ధరామయ్య త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనున్నారు. దీంతో కొద్దిరోజులుగా నాయకత్వ సమస్య తెరపైకి వచ్చింది. డీకే శివకుమార్ సైతం సీఎం కావాలనే అభిప్రాయాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు. సీఎం కావాలని ప్రతి ఒక్కరికీ ఉండటం సహజమేనని, కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన తాను పార్టీకే తన జీవితాన్ని అంకితం చేస్తానని డీకే చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఖర్గేకు అస్వస్థత.. గుండెకు పేస్‌మేకర్
నేను పీఎం అయితే.. ఒవైసీ ఆసక్తికర సమాధానం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి