Share News

Operation Sindhur: ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్‌షా

ABN , Publish Date - May 07 , 2025 | 10:13 AM

జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఈ ఆపరేషన్ సింధూర్‌పై హోంమంత్రి అమిత్‌షా స్పందించారు.

Operation Sindhur: ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్‌షా

జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఈ ఆపరేషన్ సింధూర్‌పై హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని చెప్పారు. భారత్‌పై దాడి చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత బలగాలు 'ఆపరేషన్ సింధూర్‌‌ను చేపట్టినట్లు తెలిపారు. ఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.


మరోవైపు ఆపరేషన్ సింధూర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా.. జై హింద్‌’ అంటూ పోస్టు పెట్టారు. అలాగే ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో ‘ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదు’ అంటూ భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు.

Updated Date - May 07 , 2025 | 10:20 AM