Heavy Rain: భారీ వర్షం, ఆఫీసులు బంద్.. జేసీబీలో ఎమ్మెల్యే పర్యటన..
ABN , Publish Date - May 19 , 2025 | 11:05 AM
గ్రీన్ సిటీ బెంగళూరు ప్రస్తుతం వర్షాలకు అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో అనేక ఇళ్లలోకి నీరు చేరగా, నగర పరిస్థితిపై కాంగ్రెస్‌పై జేడీఎస్ తీవ్ర విమర్శలు చేసింది.

టెక్ నగరం, గ్రీన్ సిటీ బెంగళూరులో వర్షాలు (Bengaluru heavy rain) గత 48 గంటలుగా దంచికోడుతున్నాయి. ఈ క్రమంలో అనేక లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు భారీగా చేరడంతో అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వర్షాల కారణంగా పలు ఆఫీసులు బంద్ ప్రకటించగా, మరికొన్ని మాత్రం వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కెంగేరిలో అత్యధిక వర్షపాతం 132 మి.మీ. నమోదు కాగా, బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లిలో 131.5 మి.మీ వర్షపాతంతో రెండో స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
సగటు వర్షపాతం
సోమవారం ఉదయం 8.30 గంటలకు స్థానిక వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం, గత 24 గంటల్లో బెంగళూరు నగరంలో సగటు వర్షపాతం 105.5 మి.మీ.గా రికార్డైంది. నగరంలోని అనేక ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో ప్రముఖ సిల్క్ బోర్డ్ జంక్షన్, బొమ్మనహళ్లి, HRBR లేఅవుట్ జలమయం అయ్యాయి. ఉత్తర బెంగళూరులో నీరు నిలిచిపోవడంతో బెంగళూరు నగర పోలీసులు అయ్యప్ప ఆలయానికి దారితీసే న్యూ బెల్ రోడ్డు, సారాయ్‌పల్య వైపు నాగవర బస్ స్టాప్, అల్లసంద్ర నుంచి యలహంక సర్కిల్ వరకు ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బీ బసవరాజ్ సోమవారం సాయి లేఅవుట్‌లోని ప్రభావిత ప్రాంతాన్ని జేసీబీపై ఎక్కి సందర్శించారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
ఈ క్రమంలో బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా బెంగళూరులోని గుంతల రోడ్లను సరిచేయలేకపోయిందని జేడీఎస్ ఆరోపించింది. చెత్త మాఫియాకు, కమిషన్ కోసం లొంగి గార్డెన్ సిటీని చెత్త నగరంగా మార్చారని ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ దుష్ప్రవర్తనకు అద్దం పడుతోందని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. గ్రేటర్ బెంగళూరు, బ్రాండ్ బెంగళూరు కేవలం పేర్లు మాత్రమేనని, ఈ దోపిడీ పథకానికి నిజమైన లబ్ధిదారులు కాంగ్రెస్‌వాళ్ళేనని ఆరోపించారు.
నగర అభివృద్ధికి ప్రభుత్వం అందించే సహకారం "సున్నా" అని, ఈ ప్రక్రియలో బెంగళూరు ప్రపంచ ఖ్యాతిని దెబ్బతీస్తోందని జేడీ(ఎస్) వ్యాఖ్యానించింది. దీంతోపాటు బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ మంత్రి సునీల్ కుమార్ కర్కల కూడా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ "నగర మౌలిక సదుపాయాలను" "హత్య" చేయడంలో సంబరాలు చేసుకుంటోందని అన్నారు.
ఇవీ చదవండి:
ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి