Woman Attacked Blackmailer: కాబోయే భర్తతో కలిసి యువతి దారుణం
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:12 PM
తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని కాబోయే భర్తతో కలిసి ఓ యువతి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని మురికి కాలువలో పడేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం డెడ్ బాడీని డ్రైనేజ్‌లో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
హర్యానా, అక్టోబర్ 28: తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని కాబోయే భర్తతో కలిసి ఓ యువతి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని మురికి కాలువలో పడేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం డెడ్ బాడీని డ్రైనేజ్‌లో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హర్యానా(Haryana murder case)లోని ఫరీదాబాద్ కు చెందిన లక్ష్మీ( 29) అనే యువతికి చందర్ అనే వ్యక్తితో ఢిల్లీలో పరిచయం ఏర్పడింది. చందర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. కొంతకాలంగా చందర్ ను లక్ష్మీ దూరం పెట్టింది. ఇదే సమయంలో ఆమెకు కేశవ్(30)అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. తనను కాదని లక్ష్మీ వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటుందని తెలిసి.. చందర్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన వద్ద ఉన్న ఫొటోలు అందరికీ చూపిస్తానంటూ చందర్ లక్ష్మిని బ్లాక్ మెయిల్(blackmail) చేశాడు. ఇదే విషయాన్ని తనకు కాబోయే భర్త కేశవ్ కు లక్ష్మి చెప్పింది.
ఈ క్రమంలో చందర్ ను చంపేయాలని లక్ష్మి, కేశవ్ ప్లాన్ వేశారు. అక్టోబర్ 25 చందర్ కు ఫోన్ చేసిన లక్ష్మి.. ఫరీదాబాద్ కు రమ్మని చెప్పింది. బైక్ పై చందర్.. లక్ష్మి దగ్గర వెళ్లాడు. ఇద్దరు నిర్మానుష ప్రాంతానికి వెళ్లగా.. ముందే అక్కడ ఉన్న కేశవ్(fiancé involved in murder), మరో వ్యక్తి చందర్ పై దాడి చేశారు. తలపై కొట్టడంతో అతడు పడిపోయాడు. ఆ తరువాత మెడ, గొంతుపై దాడి చేసి చందర్ ను చంపేశారు. అనంతరం డెడ్ బాడీని సమీపంలోని డ్రైనేజ్(Faridabad drainage body) లో పడేశారు. ఆదివారం పోలీసులకు సమాచారం రావడంతో.. డ్రైనేజ్ లో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు.
బైక్ నెంబర్ ఆధారంగా అతడు చందర్ గా ఫరీదాబాద్ పోలీసులు(Faridabad crime news) గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో లక్ష్మి, కేశవ్ నిందితులుగా తేలింది. వారిని విచారించగా.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నందుకు చంపేశానని నేరాన్ని అంగీకరించింది. వీరిద్దరితో పాటు హత్యలో పాల్గొన్న మరో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
యూట్యూబ్, మ్యాప్స్‌ను అధిగమించడం అసంభవం.. తేల్చి చెప్పిన పర్‌ప్లెక్సిటీ సీఈఓ
సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్