Share News

Haryana: అనిల్ విజ్‌కు బీజేపీ షోకాజ్ నోటీసు

ABN , Publish Date - Feb 10 , 2025 | 08:32 PM

ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ గత ఎన్నికల్లో తనను అంబాలా కంటోన్మెంట్ సీటులో ఓడించేందుకు కుట్ర పన్నారని అనిల్ విజ్ ఇటీవల ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చిత్ర సార్వరపై అనిల్ విజ్ 7 వేల ఆధిక్యంతో ఆ ఎన్నికల్లో గెలిచారు.

Haryana: అనిల్ విజ్‌కు బీజేపీ షోకాజ్ నోటీసు

చండీగఢ్: హర్యానా మంత్రి అనిల్ విజ్ (Anil Vij) చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనిపై బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు వివరణ కోరుతూ ఆయనకు బీజేపీ (BJP) షోకాజ్ నోటీసు ఇచ్చింది. హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బదోలి ఈ నోటీసులు పంపారు.

Ranveer Allahbadia: సీఎం వార్నింగ్‌తో యూట్యూబర్ క్షమాపణ


పొరుగు రాష్ట్రంలో (న్యూఢిల్లీ) ఎన్నికల ప్రచారంతో బీజేపీ తలమునమునకలై ఉన్న సమయంలో అనిల్ విజ్ బహిరంగ వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసులో బదోలి పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌కు, ఐక్యతకు దెబ్బతీసేలా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని తెలిపారు. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మంత్రిని ఆదేశించారు.


అనిల్ విజ్ ఏమన్నారు?

ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ గత ఎన్నికల్లో తనను అంబాలా కంటోన్మెంట్ సీటులో ఓడించేందుకు కుట్ర పన్నారని అనిల్ విజ్ ఇటీవల ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చిత్ర సార్వరపై అనిల్ విజ్ 7 వేల ఆధిక్యంతో ఆ ఎన్నికల్లో గెలిచారు. దీంతో వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన క్రెడిట్‌ను అనిల్ విజ్ నిలబెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి సన్నిహితుడికి చెందిన కొందరు కార్యకర్తలు చిత్ర సార్వర్‌తో కనిపించారని, దీనిని బట్టే ముఖ్యమంత్రి సైనీ తనను ఓడించేందుకు ప్రయత్నించారనే విషయం స్పష్టమవుతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా అనిల్ విజ్ విడుదల చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనంతరం కూడా అనిల్ విజ్ సీఎం పోస్ట్‌ను క్లెయిమ్ చేసుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు ముఖ్యమంత్రయ్యే అర్హత ఉందన్నారు.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 08:35 PM