Ranveer Allahbadia: సీఎం వార్నింగ్‌తో యూట్యూబర్ క్షమాపణ
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:25 PM
యూట్యూబర్ రణ్‌వీర్ ఇలాహాబాదియా (Raveer Allahbadia) తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. సమయ్ రైనా షో ''ఇండియాస్ గాట్ లాటెంట్''లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ముంబై: హాస్యం పేరుతో 'అసభ్యకర' వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ ఇలాహాబాదియా (Raveer Allahbadia) క్షమాపణలు చెప్పారు. సమయ్ రైనా షో ''ఇండియాస్ గాట్ లాటెంట్''లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరచేలా, పిల్లల ఆలోచనలను కలుషితం చేసేలా ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ''హద్దులు దాటితే చర్యలు ఉంటాయి'' అని హెచ్చరించారు. దీంతో 'ఎక్స్' వేదికగా ఇలాహాబాదియా క్షమాపణలు చెప్పారు.
Mamata Kulkarni: మహామండలేశ్వర్ పదవికి రాజీనామా.. ఇన్‌స్టాలో వెల్లడించిన మమతా కులకర్ణి
''ఇండియాస్ గాట్ లాటెంట్‌లో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. అందులో ఎలాంటి హాస్యం లేదు. కామెడీ నా బలం కాదు. అనుచిత వ్యాఖ్యలతో ఛానెల్‌కు ప్రచారం తెచ్చుకోవాలనుకుంటున్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు. నేను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదు. నన్ను క్షమించండి. అన్ని వయస్సులు వారు ప్రాడ్‌కాస్ట్‌ను చూస్తారు. అలాంటప్పుడు బాధ్యతగా ఉండాలనే విషయాన్ని తేలిగ్గా తీసుకునే వ్యక్తిని కాదు. కుటుంబ భావన పట్ల నాకు ఎలాంటి అగౌరవం లేదు. నేను ఈ వేదికపై మరింత మెరుగ్గా పనిచేయాల్సిన ఉందనే విషయాన్ని ఈ అనుభవం నేర్పింది'' అని పేర్కొన్నారు. తన అనుచిత వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా వీడియో మేకర్స్‌ను కోరానని, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నానని, మనవాతా దృష్టితో తనను క్షమిస్తారని ఆశిస్తున్నానని చెబుతూ తన వీడియోను ముగించారు.
సీఎం సీరియస్
దీనికి ముందు 'ఇండియాస్ లాటెండ్ షో'లో ఇలాహాబాదియా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి దేవేంద్ ఫడ్నవిస్ ఘాటుగా స్పందించారు. తాను ఆ షో చూడలేదని, అయితే విషయం తెలిసిందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉండవచ్చు కానీ అది ఇతరుల స్వేచ్ఛను అతిక్రమించేలా ఉండకూడదన్నారు. పరిమితులు దాటితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..