Ceasefire: కాల్పుల విరమణకు హమాస్ అంగీకారం
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:00 AM
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ఈమేరకు తన సమ్మతిని ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులకు తెలియజేసింది.

గాజా, టెల్‌అవీవ్, జూలై 5: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ఈమేరకు తన సమ్మతిని ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులకు తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం 60రోజులు అమలులో ఉంటుంది. హమాస్ తన దగ్గరున్న ఇజ్రాయెలీ బందీల్లో పది మందిని తొలి రోజే వదిలిపెడుతుంది. అలాగే బందీలుగా ఉంటూ మరణించిన వారి 18 మృతదేహాలను హమాస్ అప్పగిస్తుంది.
ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు, సైనిక చర్యలు నిలిపివేయాలి. ప్రజలకు నిత్యావసరాల సరఫరాలో ఆటంకాలు కలగకుండా చూడాలి. ఇజ్రాయెల్ ప్రఽధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో వచ్చేవారం పర్యటించనున్న సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందంపై తుదినిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.