Hair Stolen: ఎవర్రా మీరంతా.. రూ. కోటి విలువైన జుట్టు దోచుకెళ్లారు..
ABN , Publish Date - Mar 06 , 2025 | 03:00 PM
Bengaluru Hair Theft: దొంగలందు ఈ దొంగలు చాలా వేరయా.. అందరూ డబ్బులు, బంగారం దోచుకుంటుంటే.. వీళ్లు మాత్రం మేం డిఫరెంట్ అంటున్నారు. ఈ ముఠా కూడా భారీ చోరీ చేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరి ఇంతకీ వాళ్లు దోచుకుంది ఏంటో తెలుసా..
బెంగళూరు, మార్చి 06: సాధారణంగా దొంగలు బంగారం ఎత్తుకెళ్తారు.. డబ్బులు ఎత్తుకెళ్తారు. ఇందుకోసం బ్యాంకులు కొల్లగొట్టడం, ఇళ్లను లూటీ చేయడం, ఏటీఎం సెంటర్లను ఎత్తుకెళ్లడం చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. కానీ, ఈ దొంగలు కాస్త డిఫరెంట్. కాస్త కాదండోయ్.. పూర్తి డిఫరెంట్ అని చెప్పుకోవాలి. వీరు.. డబ్బులు ఎత్తుకెళ్లలేదు, బంగారం ఎత్తుకెళ్లలేదు. జుట్టు ఎత్తుకెళ్లారు. అవునండీ.. మీరు వింటున్నది నిజంగా నిజం. ఓ గోడౌన్ నుంచి భారీ ఎత్తున జుట్టు ఎత్తుకెళ్లారు. అయితే, దీని విలువ చాలా ఎక్కువే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడిదే సెన్సేషన్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బెంగళూరులోని ఒక గోడౌన్‌లో నిల్వ ఉంచిన హ్యూమన్ హెయిర్(మనుషుల జుట్టు)ను దొంగల ముఠా దొంగిలించింది. ఎత్తుకెళ్లిన జుట్టు విలువ రూ.90 లక్షల నుండి రూ.1 కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చైనా, బర్మా, హాంకాంగ్‌లకు ఎగుమతి చేయడానికి గోడౌల్‌ను నిల్వ ఉంచిన జుట్టును ఆరుగురు సభ్యుల ముఠా దొంగిలించింది. ఫిబ్రవరి 28న వాహనంలో వచ్చిన వీరు.. గోడౌన్‌లో నిల్వ ఉంచిన జుట్టును ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ సీన్ అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఈ ఫుటేజీ ఆధారంగా బెంగళూరు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
వ్యాపారులు ఓ గోడౌన్‌లో భారీ స్థాయిలో హెయిర్‌ను నిల్వ చేశారు. వీటిని విగ్గులు తయారీ చేసే కంపెనీలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే.. చైనాకు చెందిన విగ్గుల తయారీ కంపెనీ ప్రతినిధులు కొందరు ఈ హెయిర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇటీవలే వచ్చి.. స్టాక్‌ను చెక్ చేశారు కూడా. మరికొద్ది రోజుల్లో స్టాక్‌ను ఎగుమతి చేయాల్సి ఉంది. ఇంతలో దొంగల ముఠా ఈ జుట్టు నిల్వను దోచుకెళ్లారు. గోడౌన్ యజమానికి వెంకటరమణ ఈ చోరీని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జుట్టు చోరీ చేసిన ముఠాకు.. స్టాక్, దాని విలువ గురించి ముందే తెలిసి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది సొంత మనుషులు చేసిన పనా.. ఇతరుల పనా అని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Also Read:
Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..
LIC Scheme : టెన్త్ చదివితే చాలు.. మహిళలకు ఈ పథకం కింద 3 ఏళ్లలో రూ. 2,16,000..
For More National News and Telugu News..