Bengaluru: దారుణం..షటిల్ ఆడుతున్న బాలునిపై మాజీ జిమ్ ట్రైనర్ దాష్టీకం..
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:27 PM
ఇటీవల దేశంలో అమానవీయ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది మనుషుల వికృత చేష్టలు చూస్తే.. ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సంతోషంగా ఆడుకుంటున్న బాలుడిపై వ్యక్తి దారుణంగా దాడి చేశాడు.
బెంగుళూరు(Bengaluru)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై షటిల్ ఆడుకుంటున్న ఓ బాలుడిపై రంజన్ అనే మాజీ జిమ్ ట్రైనర్ (former gym trainer) దారుణంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యం సీసీటీవీ ఫుటేజ్(CCTV footage )లో రికార్డయ్యాయి. వీడియోలో చూపించినట్లు కొంతమంది పిల్లలు రోడ్డుపై షటిల్ ఆడుకుంటున్నారు. వారితో పాటు ఓ బాలుడు కూడా షటిల్ ఆడుతున్నాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన రంజన్ (Ranjan)కి ఏమైందో కానీ..పరుగున వచ్చి బాలుడిని వెనుక వైపు నుంచి బలంగా (child attack) తన్నాడు. దీంతో ఆ బాలుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. కనుబొమ్మలకు దెబ్బతగిలి రక్తం వచ్చింది, శరీరం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అతని ప్రవర్తన చూసి అక్కడ వాళ్లంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ఈ ఘటనపై బాలుడి తల్లి (Mother) బనశంకరి పోలీస్ స్టేషన్ (Banashankari police station) లో ఫిర్యాదు(Complaint) చేసింది. సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రంజన్ ని అరెస్ట్ చేసి.. తర్వాత బెయిల్ (Bail) పై విడిచిపెట్టారు. నిందితుడు రంజన్ గతంలోనూ పలు ప్రాంతాల్లో చిన్న పిల్లలపై అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్దేశ పూర్వకంగానే పిల్లలను లక్ష్యంగా చేసుకొని వారిపై దాడులు చేస్తారని అతని ప్రవర్తన ఒక సైకోలా ఉంటుందని స్థానికులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా రంజన్ పై సెక్షన్ బీఎన్ఏ 115/2 కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన గురించి కమీషన్ అధ్యక్షులు శశిధర్ కొసాంబే స్పందిస్తూ.. ఇదో దారుణమైన సంఘటన, పిల్లలు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలాంటి వారిపై దాడులు చేయడం వారిని మానసికంగా కృంగదీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమీషన్ లో ఫిర్యాదు చేసి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తామని అన్నారు.
ఇవి కూడా చదవండి:
గవర్నర్ రవి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ దూకుడు