Tirupati: అప్పు తీర్చడం కోసం కొడుకును తాకట్టు పెట్టిన తల్లి.. చివరకు ఘోరం జరిగిపోయింది
ABN , Publish Date - May 24 , 2025 | 07:20 PM
యానాది గిరిజన తెగకు చెదిన అంకమ్మ, అతని భర్తయ చెంచయ్య, ముగ్గురు కుమారులు తిరుపతిలో బాతుల పెంపకందారు వద్ద ఏడాది పాటు పనిచేశారు. ఆ తర్వాత చెంచయ్య మరణించడంతో అతను తనకు రూ.25,000 బాకీ పడ్డాడంటూ అంకమ్మ, ముగ్గురు కుమారులను తన వద్దే చాకిరీ చేయించుకుంటూ వచ్చాడు.

తిరుపతి: కేవలం రూ.25,000 అప్పు ఇచ్చి ఒక గిరిజన మహిళ, అతని ముగ్గురు పిల్లలతో వెట్టిచాకిరీ చేయించుకోవడంతో పాటు చివరకు ఒక పిల్లవాడి మరణానికి కారణమైన వ్యక్తిని, అతని కుటుంబ సభ్యులను పోలీసులు తిరుపతిలో అదుపులో తీసుకున్నారు. తాకట్టుగా తన వద్దే ఉంచుకున్న పిల్లవాడు పచ్చకామర్లతో చనిపోయాడని చెప్పిన సదరు సదరు బాతుల పెంపకందారు ఆ పిల్లాడి మృతదేహాన్ని తమిళనాడులోని కాంచీపురంలో పాతిపెట్టడం కలకలం రేపింది. తొలుత పిల్లవాడు పారిపోయాడని బుకాయించడం, గిరిజన మహిళ తన కులానికే చెందిన కొందరితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది.
Daughter Marriage: కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..
సంఘటన వివరాల ప్రకారం, యానాది గిరిజన తెగకు చెందిన అంకమ్మ, అతని భర్తయ చెంచయ్య, ముగ్గురు కుమారులు తిరుపతిలో బాతుల పెంపకందారు వద్ద ఏడాది పాటు పనిచేశారు. ఆ తర్వాత చెంచయ్య మరణించడంతో అతను తనకు రూ.25,000 బాకీ పడ్డాడంటూ అంకమ్మ, ముగ్గురు కుమారులను తన వద్దే చాకిరీ చేయించుకుంటూ వచ్చాడు. రోజంతా గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నందున కూలీ పెంచమని అంకమ్మ అడగింది. దీనికి అతను ససేమిరా చెప్పాడు. ఇక తాము పనిచేయలేమని అంకమ్మ చెప్పడంతో, తీసుకున్న అసలు, వడ్డీతో కలిసి రూ.45,000 ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడు. పదిరోజులు గడువులో తెచ్చి ఇస్తానని ఆమె చెప్పింది. ఒక కొడుకును తన వద్దే గ్యారంటీ కోసం అట్టిపెట్టాలని షరతు పెట్టడంతో గత్యంతరం లేక అక్కడే కొడుకుని ఉంచి వెళ్లింది.
ఏప్రిల్ చివరి వారంలో బకాయి సొమ్ము సమకూర్చుకున్న అంకమ్మ తన యజమానికి ఆ విషయం చెప్పి తాను వస్తున్నట్టు తెలియజేసింది. అయితే అతను అబ్బాయి ఎక్కడో ఉన్నాడని, ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్నాడని, ఆ తర్వాత పారిపోయాడని ఏదో సాకులు చెబుతూ వచ్చాడు. దీంతో అనుమానవచ్చిన అంకమ్మ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఒక పోలీస్ టీమ్ విచారణ చేపట్టి బాతుల పెంపకదారుని గట్టిగా నిలదీయడంతో అతను నిజం ఒప్పుకున్నాడు. పిల్లాడు చనిపోయాడని, కాంచీపురంలో గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టానని చెప్పాడు. పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో అంకమ్మ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమైంది. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపి, నిందితుడిపై వెట్టిచాకిరీ నిరోధక చట్టం, బాలకార్మక చట్టం, జ్యువనైల్ జస్టిస్ చట్టం, ఎస్సీ, ఎస్టీ అకృత్యాల చట్టం, భారతీయ న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్
Rains: రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు
Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి