Ahmedabad Air India Crash: న్యాయ విచారణ జరిపించండి: కేంద్ర మంత్రికి లేఖ
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:02 PM
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్‌కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఆ కొన్ని సెకన్లకే విమానం హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో ఒక్కరు మినహాయించి.. విమాన ప్రయాణికులతోపాటు హాస్టల్‌లో భోజనం చేస్తున్న మెడికోలు సైతం మరణించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: అహ్మదాబాద్‌లో జరిగిన 171 విమాన ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడిని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఎఫ్ఐపీ రాసింది. ఈ లేఖను సోమవారం అంటే.. సెప్టెంబర్ 22వ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి రాసింది. కానీ ఈ లేఖ బుధవారం బహిర్గతమైంది. అయితే ఈ ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వైఖరిపై ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ పెదవి వివరించింది.

ఆ క్రమంలో ఏఏఐబీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఏఏఐబీ దర్యాప్తు.. విమానయాన రంగంలోని పైలట్ల నైతికతపై ప్రతికూల ప్రభావం చూపు అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ విచారణలో భాగంగా 171 విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సబర్వాల్ నివాసానికి ఏఏఐబీ అధికారులు ఆగస్ట్ 30వ తేదీన వెళ్లారు. ఆ క్రమంలో కెప్టెన్ సబర్వాల్ తండ్రితో ఏఏఐబీ అధికారులు వ్యవహరించిన తీరుపై ఎఫ్ఐపీ ఆక్షేపించింది.
ఈ ఏడాది జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్‌కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఆ కొన్ని సెకన్లకే విమానం హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో ఒక్కరు మినహాయించి.. విమాన ప్రయాణికులతోపాటు హాస్టల్‌లో భోజనం చేస్తున్న మెడికోలు సైతం మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 260 మందికి పైగా మరణించారు. దీంతో ఈ ప్రమాద ఘటనను దర్యాప్తు వివాదంలో చిక్కుకుంది. పైలట్ తప్పిదమే కారణమన్నట్లుగా ఏఏఐబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపి.. అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఎఫ్ఐపీ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు
ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకునే వారికి.. ఇది చెంపపెట్టు: కాంగ్రెస్ పార్టీ
For More National News And Telugu News