Share News

Crime: మైనర్‌పై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. చివరికి..

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:25 PM

ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం చేయడంతో 15 ఏళ్ల మైనర్ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నామక్కల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మైనర్ ప్రసవించింది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అని తేలింది. ఇతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Crime: మైనర్‌పై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. చివరికి..
crime

తమిళనాడు, అక్టోబర్ 12: దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు ఎలాగైనా కామవాంఛ తీర్చుకునేందుకు దుర్మార్గులు యత్నిస్తుంటారు. యువకులు మాత్రమే కాకుండా మధ్య వయస్కులు, వృద్ధులు సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా అమ్మాయి అయితే చాలు అన్నట్లుగా వారి జీవితాలను అంధకారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలున్న ఓ దుర్మార్గుడు సైతం.. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.


ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం చేయడంతో 15 ఏళ్ల మైనర్ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నామక్కల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మైనర్ ప్రసవించింది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అని తేలింది. ఇతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముదలైపట్టి ప్రాంతానికి చెందిన సతీష్ కుమార్ స్థానికంగా మెకానిక్ షాపు నడుపుతుంటాడు. 2023లో మైనర్ బాలిక తన స్కూటర్ రిపేర్ కోసం అక్కడికి రాగా అతనితో పరిచయం ఏర్పడింది. కొన్నిరోజుల తర్వాత చదువు మానేసిన బాలిక.. ఆ ప్రాంతంలోనే అతనికి దగ్గరగా ఓ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేయడం మొదలు పెట్టింది. మాటామాటా కలవడంతో వారిద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒంటరిగా కలుస్తుండేవారు.


మైనర్‌పై తన కోరికను తీర్చుకోవాలని భావించిన సతీష్ కుమార్.. ఓ రోజు ఏకంగా ఆమెను తన ఇంటికి పిలిపించుకొని అత్యాచారం చేశాడు. దీంతో సదరు బాలిక బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. పోలీసులు చేసిన దర్యాప్తులో ఈ విషయాన్నంతా సదరు బాలిక వివరించింది. సతీష్ కుమారే తనను ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడని పోలీసులకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచి అతడిని జైలుకు తరలించారు.


ఇవి కూడా చదవండి:

Medical Student In Kolkata: వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్.. నిందితులు అరెస్ట్

Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

Updated Date - Oct 12 , 2025 | 04:35 PM