Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు సజీవదహనం
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:41 PM
ఓ బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు ఉదయం యథావిధిగా పనిచేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూద్దాం.

తమిళనాడు (TamilNadu) విరుదునగర్ జిల్లా చతుర్ (Chathur) సమీపంలోని పొమ్మియాపురంలో సాయినాథ్ బాణసంచా ఫ్యాక్టరీలో (Fireworks Factory) ఈరోజు (జనవరి 4న) భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఉదయం బాణాసంచా తయారీకి రసాయనాలు కలుపుతుండగా 9.40 గంటల సమయంలో రాపిడి కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా నాలుగు గదులు నేలమట్టమయ్యాయి. ఆ గదుల్లో ఉన్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే కాలిపోయారు. పేలుడు సమాచారం అందుకున్న శివకాశి, చతుర్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి.
నలుగురిపై కేసు నమోదు
వాచక్కరపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్మియాపురం గ్రామంలో సాయినాథ్ ఫైర్ వర్క్స్ పేరుతో బాలాజీ అనే వ్యక్తి పటాకుల ఫ్యాక్టరీని నడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సరైన భద్రత లేకుండా కార్మికులను పనిలో పెట్టుకోవడం వంటి 5 సెక్షన్ల కింద ఫ్యాక్టరీ యజమానులు బాలాజీ, శశిపాలన్, మేనేజర్ దాస్, ఫోర్‌మెన్ ప్రకాష్ సహా నలుగురిపై వచ్చకర పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. పటాకుల తయారీకి సంబంధించిన ముడిసరుకులను ఉంచిన గదిలోనే పేలుడు సంభవించినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో పలువురు పటాకుల తయారీలో నిమగ్నమై ఉండగా.. ఆ గదుల్లో పనిచేస్తున్న 6 మంది కూలీలు మృతి చెందారు. మరికొంతమంది గాయపడినట్లు సమాచారం.
లక్షలాది మంది..
విరుదునగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో పటాకుల ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. దీని వల్ల లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే పటాకులు కూడా తయారు చేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇదే పరిస్థితుల్లో చతుర్ సమీపంలోని అప్పయ్య నాయకన్‌పట్టి ప్రాంతంలో నిర్వహిస్తున్న సాయినాథ్ బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో నాలుగు గదులు నేలమట్టమయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. అయితే శిథిలాలలో ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. రెస్క్యూ టీమ్ ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
ఇవి కూడా చదవండి:
India vs Australia: ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత్.. క్రెడిట్ మొత్తం వీరికే
Rohit Sharma: రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More National News and Latest Telugu News