Share News

EPS: ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అసలు ఆ హీరో ప్రభావం ఎంత..

ABN , Publish Date - May 24 , 2025 | 12:30 PM

అగ్ర హీరో విజయ్ ఏర్పాటుచేసిన టీవీకే పార్టీ విజయావకాశాలపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడా పళనిస్వామి రహస్య సర్వే జరిపించారనే వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవగా.. హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ప్రభావం ఎంత అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.

EPS: ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అసలు ఆ హీరో ప్రభావం ఎంత..

- టీవీకే విజయావకాశాలపై ఈపీఎస్‌ రహస్య సర్వే..

చెన్నై: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ విజయమే లక్ష్యంగా అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి? ఈసారి ఎవరికి ఓటు బ్యాంకు పెరిగే అవకాశముంది? అని తెలుసుకునేందుకు ప్రధాన ఏజెన్సీల ద్వారా సర్వేలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షానికి ఏ మేరకు ప్రజల మద్దతు, వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకు అధికార డీఎంకే తరుఫున ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) అల్లుడు శబరీశన్‌ నిర్వహిస్తున్న బెన్‌ సంస్థ ఇటీవల సర్వే ప్రారంభించింది.


nani2.jpg

అదేవిధంగా కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ సినీ నటుడు విజయ్‌(Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) గురించి ప్రజలు ఎమనుకుంటున్నారో తెలుసుకొనేందుకు ఆ పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శి ఆదవ్‌ అర్జున్‌ నిర్వహిస్తున్న వాయిస్‌ ఆఫ్‌ కామన్‌ సంస్థ చర్యలు చేపట్టింది. ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆదేశాల మేరకు ఆయన కుమారుడు మిథున్‌ ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా 2026లో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల పరిస్థితిపై అధ్యయనం ప్రారంభించినట్లు తెలిసింది. ఈ సంస్థ ప్రతి మూడు నెలలకొకసారి సర్వే నిర్వహిస్తోంది.


ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే వరకు ప్రజల మనోభావాలు ఎలా వున్నాయి. ఏఏ పార్టీలకు ప్రజాదరణ పెరుగుతోందన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం విజయావకాశాలపై అన్నాడీఎంకే చీఫ్‌ ఎడప్పాడి పళనిస్వామి(EPS) రహస్యంగా జరిపించిన సర్వేలో విజయ్‌ పార్టీ ఒకటి,రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశముందని తెలిసింది. అయినప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీకి 234 నియోజకవర్గాల్లో ఓటు శాతం పెరిగి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ గుర్తింపు పొందేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

Read Latest Telangana News and National News

Updated Date - May 24 , 2025 | 12:30 PM