Share News

Bihar Assembly Elections: ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన ఈసీ.. 12 రాజకీయ పార్టీలతో భేటీ

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:11 PM

బిహార్ రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరినట్టు జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా తెలిపారు. బిహార్‌లో శాంతిభద్రతల సమస్య కానీ, నక్సల్స్ సమస్య కానీ లేవనీ, మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించిన తరహాలోనే బిహార్‌లోనూ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో కోరామన్నారు.

Bihar Assembly Elections: ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన ఈసీ.. 12 రాజకీయ పార్టీలతో భేటీ
Bihar Assembly Elections

పాట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల సన్నద్ధతపై రెండ్రోజులపాటు అధికారులతో సమీక్షించేందుకు ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar), ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సంధు శనివారం ఉదయం పాట్నా చేరుకున్నారు. తాజ్ హోటల్‌లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు.


12 పార్టీల ప్రతినిధులతో..

సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈసీఐ సీనియర్ అధికారులు, బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి వినోద్ గుంజ్యాల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 12 రాజకీయల పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయలను ఈసీఐ అడిగి తెలుసుకున్నారు.


ఒకే విడతలో ఎన్నికలకు జేడీయూ విజ్ఞప్తి

రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరినట్టు జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా తెలిపారు. బిహార్‌లో శాంతిభద్రతల సమస్య కానీ, నక్సల్స్ సమస్య కానీ లేవనీ, మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించిన తరహాలోనే బిహార్‌లోనూ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో కోరామన్నారు.


కాగా, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని అఖిలపక్ష సమావేశంలో ఎన్నికల కమిషన్ కోరింది. మతసామరస్యం, పరస్పర గౌరవం చాటుకుంటూ ఎన్నికల పండుగలో పాల్గొనాలని, ప్రతి బూత్‌లోనూ పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా సవరణకు కమిషన్ తీసుకున్న చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు గరిష్ట ఓటర్ల సంఖ్య 1,200గా కమిషన్ నిర్ణయించడాన్ని స్వాగతించారు. ఛాత్ పండుగ పూర్తయిన తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ఇందువల్ల ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని కమిషన్‌కు తెలిపారు. సాధ్యమైనంత తక్కువ విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈనెల 6 లేదా 7వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

సోషల్ మీడియా ట్రోల్స్‌తో జన్‌నాయక్‌లు కాలేరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2025 | 07:14 PM