Purdanasheen women Voting: బిహార్ ఎన్నికలు.. పర్దానషీన్ మహిళా ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:27 AM
బిహార్‌లో పర్దానషీన్ మహిళా ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణ కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఈసీ తాజాగా ఆదేశించింది. పర్దానషీన్ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల (Bihar Elections) కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం తాజాగా మాజీ సీఈసీ టీఎన్ శేషన్ మార్గదర్శకాలను అమలు చేసేందుకు నిర్ణయించింది. పర్దానషీన్ (బుర్ఖా ధరించిన) మహిళా ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణ కోసం టీఎన్ శేషన్ సారథ్యంలో ఈసీ 1994లో రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేయనుంది (EC Guidelines For Purdanasheen Women Voter Identification).
ఇందుకు సంబంధించి బిహార్ ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్దానషీన్ మహిళా ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణ కోసం ప్రత్యేక క్యాబిన్స్ ఏర్పాటు చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌తో పాటు, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. మహిళల గోపత్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రత్యేక క్యాబిన్‌లల్లో మహిళా సిబ్బందితో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. బుర్ఖా ధరించిన మహిళలు ఎక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్లు, ప్రాంతాల పరిధిలో ఈ ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో తగిన సంఖ్యలో మహిళా సిబ్బంది, కనీసం ఒక మహిళా పోలింగ్ అధికారి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇతర పోలింగ్ స్టేషన్లలో కూడా కనీసం ఒక మహిళా అధికారి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం మహిళా విలేజ్ లెవెల్ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, ప్రభుత్వ మహిళా టీచర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించింది. ఇక తగినంత మంది మహిళ సిబ్బంది అందుబాటులో లేని ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రత్యేకంగా మహిళా సహాయకులను నియమించుకునే అవకాశం కూడా కల్పించింది. సంప్రదాయక వర్గాలు, గిరిజన ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ అప్పట్లో ఈ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
మీ 4వ భార్యకు నెలకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సిందే.. ఎంపీకి తేల్చి చెప్పిన హైకోర్టు
మోదీకి ట్రంప్ అంటే భయం: రాహుల్ గాంధీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి