Bihar New Voter Cards: ఎస్ఐఆర్ పూర్తికాగానే అందరికీ కొత్త ఓటరు కార్డులు.. ఈసీ ప్లాన్
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:09 PM
ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లు ఇచ్చేటప్పుడే దరఖాస్తు ఫారంపై కొత్తగా తీయించుకున్న ఫోటోను జత చేయాలని అధికారులు కోరారు. రికార్డులు అప్‌డేట్ చేసేటప్పుడు కొత్త ఫోటోలను జత చేసి కొత్త ఓటరు కార్డులు జారీ చేస్తారని ఈసీ వర్గాల పేర్కొన్నాయి.
పాట్నా: బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Bihar SIR) ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రంలోని ఓటర్లందరికీ కొత్త ఓటర్ గుర్తింపు కార్డులు (Voter identity cards) ఇచ్చే ఆలోచనలో ఎన్నికల కమిషన్ (Election Commission) ఉందని అధికార వర్గాల సమాచారం. అయితే ఎప్పటి నుంచి కొత్త కార్డులు జారీ చేస్తారనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లు ఇచ్చేటప్పుడే దరఖాస్తు ఫారంపై కొత్తగా తీయించుకున్న ఫోటోను జత చేయాలని అధికారులు కోరారు. రికార్డులు అప్‌డేట్ చేసేటప్పుడు కొత్త ఫోటోలను జత చేసి కొత్త ఓటరు కార్డులు జారీ చేస్తారని ఈసీ వర్గాల పేర్కొన్నాయి.
బిహార్ ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 1న ప్రచురించారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 7.24 కోట్ల ఓటర్లు ఉన్నారు. తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 30న పబ్లిష్ చేస్తారు. నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. ఆలోపు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువుతీరాల్సి ఉంటుంది.
ఈసీ వర్గాల కథనం ప్రకారం, ఇంతవరకూ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసిన 99 శాతం మంది తమ డాక్యుమెంట్లు సమర్పించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు గల్లంతైనందున జాబితాలో తమ పేర్లు చేర్చాలంటూ 30,000 మంది నుంచి విజ్ఞాపనలు వచ్చాయి. కాగా, రేషనలైజేషన్ కారణంగా రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్లు 77,000 నుంచి 90,000కు పెంచారు. రేషనలైజేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా కూడా చేపట్టనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి..
అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్
రేపట్నించి మంచినీళ్లు కూడా ముట్టను.. మనోజ్ జారంగే హెచ్చరిక
For More National News And Telugu News