Share News

Trump's Son Visits Taj: తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్

ABN , Publish Date - Nov 20 , 2025 | 09:16 PM

డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భారత పర్యటనకు విచ్చేశారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగే ఓ ఎన్ఆర్ఐ జంట వివాహం కోసం ఇండియాకు వచ్చిన ఆయన.. గురువారం సాయంత్రం తాజ్ మహల్‌ను సందర్శించారు.

Trump's Son Visits Taj: తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్
Donald Trump's Son Visits Taj Mahal

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తాజ్ మహల్‌ను సందర్శించారు(Donald Trump's Son Visits Taj Mahal). సుమారు గంటసేపు తాజ్ ఆవరణలో గడిపారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆగ్రాకు చేరుకున్న ఆయన.. అక్కడి డయానా బెంచ్‌(Diana bench) సహా పలు ఏరియాల్లో ఫొటోలు దిగినట్టు తెలిపారు. అంతకముందు.. అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పాటు సుమారు 40 దేశాలకు చెందిన 126 మంది అతిథులతో కూడిన ఓ పెద్ద బృందంతో ఉత్తర్ ప్రదేశ్‌కు చేరుకున్నారు ట్రంప్ జూనియర్(Trump Junior). రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగే భారతీయ అమెరికన్ జంట హై ప్రొఫైల్ డెస్టినేషన్ వెడ్డింగ్(High profile destination Wedding) కోసం ఆయన భారత్‌కు విచ్ఛేశారు. ఈ రాత్రికి ఆయన ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో బస చేయనున్నట్టు తెలుస్తోంది.


ట్రంప్ జూనియర్ హాజరయ్యే ఈ వేడుకకు.. దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులూ వస్తారని సమాచారం. ట్రంప్ జూనియర్ రాక నేపథ్యంలో ఇప్పటికే అక్కడి అధికార యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆయన భారత పర్యటనకు ముందే.. ఇక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు అమెరికా భద్రతా బృందం ఉదయపూర్(Udaipur) చేరుకుంది. ఏసీపీ(ACP), ఏడీసీ(ADC) స్థాయి అధికారులతో సహా సుమారు 200 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు.

ట్రంప్ జూనియర్ భారత్‌కు రావడం ఇది రెండోసారి. గతంలో ఆయన 2018 ఫిబ్రవరిలో తొలిసారిగా ఇండియాలో పర్యటించారు. అప్పుడు.. న్యూఢిల్లీ, ముంబయి, పుణె, కోల్‌కతాలను సందర్శించారు.


ఇవీ చదవండి:

ఇండియాకు 'జావెలిన్ మిస్సైల్'.. దీని గురించి తెలుసా.?

అల్‌ ఫలాహ్‌ నుంచి 10 మంది పరారీ

Updated Date - Nov 20 , 2025 | 09:25 PM