Donald Trump: అమెరికా అధ్యక్షుడైఉండి.. అన్ని అబద్ధాలా?
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:09 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో చిన్న అబద్ధం ఆడేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే, ఆ మాటలు అవాస్తవమని భారత్..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో చిన్న అబద్ధం ఆడేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా నాతో చెప్పారని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయితే, భారత్.. ట్రంప్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ట్రంప్-మోదీల మధ్య అలాంటి సంభాషణ ఏదీ జరగలేదని తేల్చి చెప్పారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే భారత్‌కు ముఖ్యమని పునరుద్ఘాటించారు. దీంతో మరో సారి ట్రంప్ మాటలు అబద్దాలని తేలిపోయింది.
ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ సహా అనేక విషయాల్లో ట్రంప్, పదే పదే.. చిన్న చిన్న అబద్దాలు చెప్పేస్తుంటారు. ఇదేంటని అడగితే, మరో కథ చెబుతారు. తాజా చమురు కొనుగోళ్లు విషయంలోనూ ట్రంప్ అదే చేశారు. భారత్ తిరస్కరించిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. ఒకవేళ భారత్ అలా చెప్పాలనుకుంటే మాత్రం.. వాళ్లు భారీస్థాయిలో టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటారని ట్రంప్ అన్నారు. కానీ భారత్ అలా చేయబోదని నేను అనుకుంటున్నానని ట్రంప్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పేరు వింటే.. శత్రువులకు నిద్ర పట్టదు: ప్రధాని మోదీ
For More National News And Telugu News