Viral News: కుక్క కోసం రూ.50 కోట్లు.. ఈడీ విచారణలో డాగ్ సతీష్ రహస్యాలు బట్టబయలు
ABN , First Publish Date - 2025-04-17T21:09:43+05:30 IST
బెంగళూరులోని ఓ వ్యక్తి పేరు సతీష్. కానీ జనాలు అతన్ని "డాగ్ సతీష్" అని పిలుస్తారు. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లు పెట్టి కొన్నానని చెప్పాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరి దృష్టి అతనిపై పడింది. కానీ ఈ విషయం తెలిసిన ఈడీ అధికారులు దర్యాప్తు చేయడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసించే ఎస్. 'డాగ్ సతీష్' అని జనం పిలిచే సతీష్ అసలు నిజ స్వరూపం ఇటీవల వెలుగులోకి వచ్చింది. సతీష్ కొన్ని నెలల క్రితం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కను (వోల్ఫ్‌డాగ్) కొన్నానని, దీని ధర రూ.50 కోట్లు అని పేర్కొన్నాడు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ED(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. ఆ క్రమంలో దర్యాప్తులో భాగంగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సతీష్ వాదన ఏంటి
సతీష్ అమెరికా నుంచి 'కాడబోమ్స్ ఒకామి' అనే కుక్కను కొన్నానని, అది అరుదైన తోడేలు కుక్క అని చెప్పాడు. ఈ జాతి తోడేలు, కాకేసియన్ షెపర్డ్ మిశ్రమం అని వెల్లడించాడు. అలాంటి కుక్క భారతదేశానికి తొలిసారి వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నాడు.
ED దాడుల్లో అసలు నిజం
బెంగళూరులోని జేపీ నగర్‌లోని సతీష్ ఇంటిపై ఈడీ దాడులు చేసినప్పుడు, రూ.50 కోట్ల విలువైన కుక్కను కొనుగోలు చేయలేదని, అలాంటి పత్రం లేదా రుజువు ఏదీ తన దగ్గర లేదని తేలింది. మీడియాలో ఫేమస్ అయ్యేందుకే సతీష్ ఇదంతా చెప్పినట్లు తెలిపాడు. అంతేకాదు ఆ కుక్కను చూపించమని సతీష్‌ని అధికారులు అడిగారు. కానీ ఆ కుక్క కూడా తనది కాదని, తన స్నేహితుడి దగ్గర ఉందని చెప్పాడు. సతీష్ తనను తాను పెద్ద కుక్కల పెంపకందారునిగా చెప్పుకుంటాడు. కానీ దర్యాప్తులో అతను ఆర్థికంగా బలహీనుడని, కోట్ల విలువైన కుక్కను కొనగలిగే ఆస్తి లేదా ఆదాయం అతనికి లేదని వెలుగులోకి వచ్చింది.
హవాలా, అక్రమాల గురించి ఇప్పటికే ఫిర్యాదులు
అంతేకాదు సతీష్ పై EDకి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయి. వాటిలో హవాలా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా ED అతని ఆదాయం, ఖర్చులపై దర్యాప్తు ప్రారంభించింది. సతీష్ అబద్ధాన్ని ఎందుకు వ్యాప్తి చేశాడో తెలుసుకోవడానికి ED ప్రయత్నిస్తోంది. అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అతని నిజమైన వృత్తి ఏంటి, సోషల్ మీడియా ద్వారా తనను తాను 'మిలియనీర్ డాగ్ లవర్'గా చూపించుకున్నాడు. కానీ వాస్తవానికి అతనికి అలాంటిదేమీ లేదు.
ఇవి కూడా చదవండి:
IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Read More Business News and Latest Telugu News