DK Shivakumar: బిహార్ ఉద్యోగులకు 3 రోజుల పెయిడ్ హాలిడే.. కంపెనీలను కోరిన డీకే
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:38 PM
బెంగళూరుతో సహా రాష్ట్రంలోని పలు చోట్ల పెద్దసంఖ్యలో బిహారీలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి ఆయా సంస్థల యజమానులు కనీసం మూడు రోజుల పాటు పెయిడ్ హాలిడే ఇవ్వాలని డీకే శివకుమార్ కోరారు.
బెంగళూరు: బిహార్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా కర్ణాటకలో పనిచేస్తున్న బిహారీలకు మూడు రోజులు వేతనంతో కూడిన హాలిడే (Paid Holiday) ఇవ్వాలని రాష్ట్రంలోని కంపెనీలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారు. నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగునున్న నేపథ్యంలో డీకే ఈ విజ్ఞప్తి చేశారు. డీకే కార్యాలయం ఈ మేరకు ఒక విజ్ఞాపన విడుదల చేసింది.
బెంగళూరుతో సహా రాష్ట్రంలోని పలు చోట్ల పెద్దసంఖ్యలో బిహారీలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి ఆయా సంస్థల యజమానులు కనీసం మూడు రోజుల పాటు పెయిడ్ హాలిడే ఇవ్వాలని డీకే కోరారు. ఇందువల్ల ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేయగలుగుతారని అన్నారు. వలస కార్మికులు చురుకుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు సహకరించాలని కంపెనీలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, దుకాణాల యజమానులు, ఇతర ఇండస్ట్రియల్ ఆపరేటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐఆర్ పేరుతో నిశ్శబ్ద రిగ్గింగ్.. మమత నిరసన ర్యాలీ
రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి