Share News

Dipavali 2025: ఊరూరా దీపావళి వేడుకలు.. పండుగ విశిష్టత, పరమార్థం ఇదే!

ABN , Publish Date - Oct 20 , 2025 | 11:32 AM

దీపావళి పర్వదినానికి అత్యంత ప్రాముఖ్యత, ఎంతో పురాతన చరిత్ర ఉంది. కొన్ని విశేషాంశాలు ఇప్పుడు చూద్దాం. భూమిపై భారాన్ని తగ్గించడానికి రాక్షసులను అంతమొందించడం దేవతల చేస్తూ ఉంటారు. స్థితి కారకుడైన శ్రీహరి అనేక అవతారాలు ధరించి రాక్షసులను వధించి సజ్జనులను కాపాడతారు.

Dipavali 2025: ఊరూరా దీపావళి వేడుకలు.. పండుగ విశిష్టత, పరమార్థం ఇదే!
Dipavali 2025

Dipavali 2025: దీపావళి.. దేశమంతటా దేదీప్యమానంగా వెలిగిగే రోజు. దీప కాంతుల నడుమ ప్రతి ఇల్లు, ప్రతి దేవాలయం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రం వెలుగొందుతుంటుంది. 'దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః' అని శాస్త్ర వచనం. దీని అర్ధం దీపపు జ్యోతియే పరబ్రహ్మ అని. హిందూ సంప్రదాయంలో ఏ దేవతారాదన చేసినా దీపం ఖచ్చితంగా వెలిగించాలి. దీపం లేకుండా పూజ చేయకూడదు. చీకటిని చీల్చి వెలుగును ప్రసాదించడం కేవలం దీపానికి సాధ్యం. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతి వెలిగించు భగవంతుడా! అని దీపాన్ని వెలిగిస్తారు. పునరపి మరణం, పునరపి జననం అనే బంధం నుంచి విముక్తి కలిగించి శాశ్వతమైన శివసాయుజ్యస్థితిని పరమాత్మ అనుగ్రహించాలని దీపారాధన చేస్తారు.


బాహ్యంగా ఈ దీపపు జ్యోతి అంతర్ముఖంగా ఉన్న జీవుడి ఆత్మను ప్రతిభింబిస్తుంది. సనాతన ధర్మంలోని మంత్ర పుష్పం ప్రకారం.. ప్రతి జీవి శరీరంలో నాభి పైభాగాన, చాతి కింది భాగాన శరీంరంలో వడ్లగింజ మొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో, అంతే సూక్ష్మంగా ఆత్మ 'దివ్' అనే తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. దీనినే ఇటీవల నాసా తమ పరిశోధనల్లో తేల్చింది. అంతు చిక్కని ఈ జ్యోతి ఏదో శరీరంలో వెలుగొందుతుంది. ఇది ఏంటో మాకు అర్ధం కావట్లేదు. బహుశా హిందువులు తమ మంత్ర పుష్పంలో జ్యోతి ఇదేనేమో అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.చరిత్ర నిరూపించగలిగేది సైన్స్ అయితే.. చరిత్రకు అందని విషయాలను ప్రస్తావించేంది స్పిరిచువల్ సైన్స్. ప్రతిదీ ప్రయోగ శాలలోనే నిరూపించడం వీలు కాదని.. కొన్ని యోగ శాలలో, మరికొన్ని యాగశాలలో నిరూపించబడుతాయి పండితులు చెబుతున్నారు.


దీపావళి పర్వదినానికి అత్యంత ప్రాముఖ్యత, ఎంతో పురాతన చరిత్ర ఉంది. కొన్ని విశేషాంశాలు ఇప్పుడు చూద్దాం. భూమిపై భారాన్ని తగ్గించడానికి రాక్షసులను అంతమొందించడం దేవతల చేస్తూ ఉంటారు. స్థితి కారకుడైన శ్రీహరి అనేక అవతారాలు ధరించి రాక్షసులను వధించి సజ్జనులను కాపాడతారు. ద్వాపర యుగంలోని శ్రీ కృష్ణ పరమాత్మ కూడా ధర్మాన్ని పునః స్థాపించేందుకు అవతారం ధరిస్తాడు. అనేక మంది అసురులను అంతమొందిస్తారు. శ్రీహరి వరాహావతారం ఎత్తినప్పుడు భార్య భూదేవికి ఒక అసుర ప్రవృత్తితో నరకుడు జన్మిస్తాడు. అతడు ప్రాగ్జ్యోతిషాపురాన్ని రాజధానిగా చేసుకొని భూ మండలాన్ని ఏలుతాడు. నరకుడు రాక్షసత్వం ప్రబలి భూ మండలం మొత్తం అతలాకుతలం అవుతుంది. దీంతో శ్రీ కృష్ణ పరమాత్మను ఇంద్రుడితో సహా దేవలందరూ ప్రార్ధించగా.. భూ భారాన్ని తగ్గించేందుకు నరకాసురిడితో యుద్దానికి సిద్ధం అవుతాడు.


యుద్ధానికి బయల్దేరుతున్న శ్రీ కృష్ణ పరమాత్మతో భార్య సత్యభామ సైతం తాను యుద్దానికి వస్తానని అడగగా.. శ్రీకృష్ణుడు వెంట తీసుకెళతాడు. ఒక రథంపై సత్యభామతో కృష్ణుడు, మరో రథంపై నరకాసురుడు అధిష్టించి యుద్ధం చేస్తారు. శ్రీకృష్ణుడు, నరకాసురుడి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. ఒకానొక సమయంలో నరకుడి అస్త్రాల ధాటికి కృష్ణ పరమాత్మ మూర్చపోతాడు. వెంటనే సత్యభామ విల్లును ధరించి నరకాసురుడితో వీరోచితంగా పోరాడుతుంది. సత్యభామ బాణ పరంపరకు నరకుడు తట్టుకోలేకపోతాడు. భీకర యుద్ధం కొనసాగుతుంటుంది. కొంత సేపటికి సత్యభామ అస్త్రానికి నరకుడు పడిపోతాడు. మూర్ఛనుంచి తేరుకున్న శ్రీ కృష్ణుడు.. తన సుదర్శన చక్రంతో నరకాసురుడిని వదిస్తారు. నరకాసురుడు మరణంతో భూదేవి శాంతి పొందుతుంది. భూమిపై భారం తొలగిపోతుంది.


ఈ వీరోచిత యుద్ధం ఆశ్వీయుజ మాసం చివరి రోజైన చతుర్దశి తిథి రోజున జరుగుతుంది. అందుకే ఈ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. ఆ తరువాత రోజైన అమావాస్యనాడు ద్వారకా నగరం మొత్తం నగర వాసులు ఇంటికి ఇరువైపులా దీపాలు వెలిగించి శ్రీ కృష్ణ -సత్యభామలకు నీరాజనం పలుకుతారు. వీరనారి సత్యభామ పోరాటాన్ని ప్రతిఏటా గుర్తుచేసుకంటూ నరక చతుర్దశి, దీపావళి పండుగ జరుపుకుంటారు. పంచపాండవులు, కౌరవులపై యుద్ధం గెలిచిన తరువాత హస్తినాపురంలో ఇంటింటా దీపాలు పెట్టి వీరిని ఆహ్వానిస్తారు. ద్రౌపతీ సామెత పంచపాండవుల వీరోచిత పోరాటానికి తార్కాణంగా దీపావళి జరుపుకుంటారు.


ఇక త్రేతాయుగంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారు, రావణాసురిడితో యుద్ధం చేసి గెలుస్తారు. రావణుణ్ణి హతమార్చి అయోద్యకు పయనమవుతారు. నగరానికి విచేసిన శ్రీ సీతారామ చంద్రునికి, లక్ష్మణుడికి నగర ప్రజలు స్వాగతం పలుకుతారు. ఇంటింటా దీపాలు వెలిగించివారిని ఆహ్వానిస్తారు. అజ్ఞానాంధకారంతో విర్రవీగుతున్న రావణుణ్ణి హతమార్చి ధర్మం పునః స్థాపించినందుకు, జ్ఞాన జ్యోతిని వెలిగించినందుకు చిహ్నంగా దీపాలు వెలిగితారు. దీపకాంతులంతో అయోధ్య నగరం ప్రజ్వరిల్లుతుంది. శ్రీ రాముడి ధర్మాన్ని.. రామాయణ ప్రశస్తాన్ని తరతరాలకు గుర్తుండి పోయేలా, ప్రతియేటా ఈ గాథను ప్రజలు స్మరించుకుంటారు.


ఇవి కూడా చదవండి:

PM Modi: స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయండి: ప్రధాని మోదీ

Diwali 2025: దీపావళి రోజు ఇవి దానం చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం

Updated Date - Oct 20 , 2025 | 03:26 PM