Share News

Diwali 2025: దీపావళి రోజు ఇవి దానం చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం

ABN , Publish Date - Oct 20 , 2025 | 08:40 AM

దానం చేయడం వలన విశేష పుణ్యం లభిస్తుందని హిందువుల నమ్మకం. దీపావళి రోజున చీపురు దానడం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు, కీర్తి లభిస్తుందని పండితులు అంటున్నారు. ఇంట్లో చీపురును లక్ష్మీకి ప్రతిరూపంగా భావిస్తారు. ఇంటిని శుభ్రం చేసేది చీపురు. ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని పూజారులు చెబుతారు.

Diwali 2025: దీపావళి రోజు ఇవి దానం చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం
Diwali 2025

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 20: దేశంలోని అన్ని రాష్ట్రాలు అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ దీపావళి. దేశంలో అతి ముఖ్యమైన హిందూ పండగా కూడా దీపావళి( Deepavali)గా చెప్పవచ్చు. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని సమాజ శ్రేయస్సును కోరుకొని ఈ పండుగను జరుపుకుంటారు. నాలుగు రోజులు పాటు ఈ దీపావళి పండుగను నిర్వహించుకుంటారు. ధన త్రయ ఏకాదశి, నరక చతుర్దశి, దీపావళి, కనుమ మొత్తం నాలుగు రోజులు వైభవంగా సాగే అతి పెద్ద పండుగ ఇది. కార్తీక మాసం ప్రారంభానికి ముందు అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండగ రోజున ఉదయాన్నే స్నానం చేసి స్తోమత మేరకు కొత్త బట్టలు ధరించి దేవతారాధన చేసి, తులసి దేవతను పూజించి దీపాలు వెలిగించాయి. సమీపంలోని దేవాలయాలను దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అనంతరం ఇంటిల్లిపాది తీపి పదార్థాలు స్వీట్లతో భోజనం చేసి పండుగను జరుపుకోవాలి. సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరించి దేవతలనుఆ ఆహ్వానించాలి. ఇక సాయంత్రం సమయంలో బాణాసంచా కలుస్తూ చిన్నారులతో కలిసి సంతోషాన్ని జరుపుకోవాలి. వ్యాపారాలు ఈరోజున ముఖ్యంగా లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తమ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని అమ్మావారిని ప్రార్థిస్తారు.


దానం చేయడం వలన విశేష పుణ్యం లభిస్తుందని హిందువుల నమ్మకం. దీపావళి రోజున చీపురు దానడం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు, కీర్తి లభిస్తుందని పండితులు అంటున్నారు. ఇంట్లో చీపురును లక్ష్మీకి ప్రతిరూపంగా భావిస్తారు. ఇంటిని శుభ్రం చేసేది చీపురు. ఎక్కడ శుభ్రం ఉంటే అక్కడ లక్ష్మీ దేవి అనుగ్రహం (Goddess Lakshmi's blessings) ఉంటుందని పూజారులు చెబుతారు. అలాగే పేదలకు ఆహారం, స్వీట్లు దానం చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో ఎప్పటికి తగువులు రాకుండా.. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందని చెబుతారు. విశేష దాన ఫలితంతో కుబేరుడు ప్రసన్నం చేస్తుందని, దీంతో ఇంట్లో ధనం చాలా వృద్ధి చెందుతుందని. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుంటాయని చెబుతున్నారు.


మరీ ముఖ్యంగా దీపావళి రోజున గోవు సేవ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. అమ్మ తరువాత అమ్మగా భావించే గోవు పూజ వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తెలుపుతున్నారు. గోపు యొక్క పృష్ఠ భాగంలో లక్ష్మీ దేవి కొలువుంటుంది. అందులో ఇంటి ముందు అలుకు (కళ్ళాపి) చల్లి ముగ్గులు పెడుతారు. గోమయం నుంచి వచ్చే సువాసన అనారోగ్యాన్ని దూరం చేసి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఆవులు ఉండే ఆశ్రమానికి డబ్బును విరాళంగా అందించడం, ఆవులకు మేత వేయడం వల్ల మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇక దీపావళి రోజున చిన్న పిల్లలకు కొత్త బట్టలు దానం చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Naraka Chaturdashi 2025: భూభారహరణం.. నరకాసురుడి మరణం

Ayodya Deepotsav World Record: 26 లక్షల దీపాలతో అయోధ్య ప్రపంచ రికార్డు

Updated Date - Oct 20 , 2025 | 09:57 AM