Share News

Molestation Of Students: విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. పరారీలో ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 02:43 PM

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ చైతన్యానంద సరస్వతి మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఏకంగా 17 మంది విద్యార్థినులు డైరెక్టర్ మీద ఫిర్యాదు చేయడం విశేషం.

Molestation Of Students: విద్యార్థినులపై లైంగిక వేధింపులు..  పరారీలో ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌
Delhi students harassment

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ మీద కేసు(Delhi institute sexual harassment case) నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌‌లో‌ ఉన్న ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతి (గతంలో డాక్టర్ పార్థసారథి)పై ఈ కేసు నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.


సదరు విద్యాసంస్థలో EWS స్కాలర్‌షిప్ కింద PGDM కోర్సులు చదువుతున్న ఏకంగా 17 మంది విద్యార్థినులు డైరెక్టర్ చైతన్యానంద మీద ఫిర్యాదు చేయడం విశేషం. ఆగస్టు 4న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో మొదటి ఫిర్యాదు దాఖలైంది. చైతన్యానంద విద్యార్థినులపై అసభ్య భాష, అశ్లీల మెసేజ్‌లు పంపడం, అనవసరంగా శరీర భాగాల్ని తాకడం వంటి చేష్టలు చేశాడని పోలీసులు తెలిపారు. ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్లు కూడా ఈ చర్యలకు మద్దతు ఇచ్చి, విద్యార్థినిలను ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.


పోలీసులు BNS సెక్షన్లు 75(2)/79/351(2) కింద కేసు నమోదు చేశారు. మొత్తం 16 మంది బాధిత అమ్మాయిల వాంగ్మూలాలు పటియాలా హౌస్ కోర్టులో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేశారు. నిందితుడు వాడిన వోల్వో కార్‌ను (ఫేక్ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ 39 UN 1తో) సీజ్ చేశారు. SRISIIM ఇన్‌స్టిట్యూట్‌లోని CCTV ఫుటేజ్, NVRలు FSLకు పంపి దర్యాప్తు చేస్తున్నారు.


లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో చైతన్యానంద సరస్వతిని వెంటనే ఇన్‌స్టిట్యూట్ నుంచి తొలగించారు. శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామ్నాయ శారదాపీఠం, శృంగేరి సంస్థ కూడా సంబంధాలు తెగించుకుని, అతని చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఫిర్యాదు చేశాయి. పోలీసులు దాడులు, రైడ్‌లు చేసినా నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఈ కేసు (Delhi trending news) మరోసారి విద్యా సంస్థల్లో మహిళలకు లభిస్తున్న రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 03:06 PM