Delhi Women Thieves: కిలేడీలు.. క్షణాల్లో బంగారు ఉంగరం చోరీ!
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:27 PM
తమ కంటే ఎవ్వరూ బాగా చోరీ చేయలేరు అన్నట్లు కొందరు కిలేడీలు.. దొంగతనాలు చేస్తుంటారు. బంగారు షాపులే టార్గెట్ గా ఈ మాయలేడీలు చోరీలు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు మహిళలు..సంప్రదాయనీ సుద్దపూసలు అనే విధంగా రెడీ అయ్యి.. బంగారు షాపుకు వెళ్లి.. క్షణాల్లో గోల్డ్ రింగ్ ను దొంగిలించారు.
కొందరు కష్టపడి సంపాదించడం చేతకాక ఇతరుల సంపాదనను చోరీ చేస్తుంటారు. ఇలాంటి వారిలో ఎక్కువగా మగవారే ఉంటారు. అయితే తాము కూడా తక్కువేమి కాదన్నట్లు కొందరు లేడీస్ కూడా దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే.. తమ కంటే ఎవ్వరూ బాగా చోరీ చేయలేరు అన్నట్లు కొందరు కిలేడీలు.. దొంగతనాలు చేస్తుంటారు. బంగారు షాపులే టార్గెట్ గా ఈ మాయలేడీలు చోరీలు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు మహిళలు..సంప్రదాయనీ సుద్దపూసలు అనే విధంగా రెడీ అయ్యి.. బంగారు షాపుకు వెళ్లి.. క్షణాల్లో గోల్డ్ రింగ్ ను దొంగిలించారు. వీరి టాలెంట్ షా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.
శనివారం ఢిల్లీ నగరంలోని ఓ గోల్డ్ షాపు(Delhi gold theft)లోకి ఇద్దరు మహిళా వెళ్లారు. తమకు ఉంగరాలు చూపించమని అడగ్గా.. షాపులో ఉండే వ్యక్తి రింగ్స్ ఉంటే బాక్స్ ను వారి ముందు ఉంచింది. ఆ తర్వాత తన పనిలో తాను నిమగ్నమైంది. ఆ ఇద్దరు మహిళలు ఉంగారాలను చూస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలో వారిలోని ఓ మహిళ ఉంగారాన్ని తీసుకుని టేబుల్ కింద నుంచి పక్కనే ఉన్న మహిళ చేతికి ఇచ్చింది. ఆమె వెంటనే తన దగ్గర ఉన్న బ్యాగులో వేసుకుంది. ఇక రింగ్(gold theft) తీసిన ప్లేస్ కనిపిస్తే.. షాపు వాళ్లు కనిపెట్టేస్తారని నకిలీ రింగును అదే పెట్టేలే పెట్టారు. ఆ తరువాత ఏమి తెలియనట్లు అక్కడి నుంచి జారుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో(Video Viral) నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియో(CCTV footage)పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ టాలెంట్ ఏదో మంచి పనుల్లో చూపిస్తే.. బాగుపడేవారని , ఇలాంటి మాయలేడీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారికి గోల్డ్ షాపుల(gold shop) వారు గట్టి ట్రీట్ మెంట్ ఇస్తే.. మరోసారి ఇలాంటి దొంగతనాలు చేయరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని.. త్వరలోనే ఆ జంటను గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు(police investigation) హామీ ఇచ్చినట్లు సమాచారం. తరచూ షాపులకు వస్తూ గోల్డ్ కొనకుండా వెళ్లే వారి పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ
పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్