Share News

IMD Rain Alert: ఉత్తరాదిన దంచుతున్న వానలు.. ఉత్తరాఖండ్‌కు ఐఎమ్‌డీ రెడ్ అలర్ట్

ABN , Publish Date - Aug 12 , 2025 | 08:02 AM

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మంగళవారం కుండపోత వర్షం కారణంగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. బిహార్‌లో వరదలు పోటెత్తి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది.

IMD Rain Alert: ఉత్తరాదిన దంచుతున్న వానలు.. ఉత్తరాఖండ్‌కు ఐఎమ్‌డీ రెడ్ అలర్ట్
IMD Red Alert Uttarakhand

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆగస్టు 17 వరకు ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌‌డీ) పేర్కొంది.

ఇక ఉత్తరాఖండ్‌లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. అక్కడి జిల్లాల్లో కొన్నింటికి రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ సిబ్బందిని అలర్ట్‌లో పెట్టింది. ప్రజలు నదుల వద్దకు వెళ్లకుండా ఉండాలని స్థానిక అధికారులు సూచనలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరో వైపు, భారీ వర్షాలు బీహార్‌నూ ముంచెత్తాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. భగల్‌పూర్ ప్రాంతంలో వరద కారణంగా పలు నివాస ప్రాంతాలను నీట మునిగాయి. రెండు డజన్లకు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.


ఈ వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సాధారణ వర్షపాతం నమోదైనట్టు ఐఎమ్‌డీ తెలిపింది. జూన్ 1 నుండి ఆగస్టు 10 వరకు దేశం మొత్తం 539 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. ఇది దీర్ఘకాల సగటు కంటే 1 శాతం అధికం. కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి మరికొన్ని చోట్ల అనావృష్టి ఉన్నచట్టు కూడా ఐఎమ్‌డీ పేర్కొంది. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, 5 ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. మరో 5 ప్రాంతాల్లో అధిక వర్షపాతం, లడాఖ్‌లో భారీ వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

For More National News and Telugu News

Updated Date - Aug 12 , 2025 | 09:11 AM