Delhi NCR Air Quality Deteriorates: ఢిల్లీ వాయు కాలుష్యం వెరీ పూర్.. ఇండెక్స్‌పై 300 పాయింట్లకు వాయు నాణ్యత
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:53 AM
ఢిల్లీ ఎన్సీఆర్‌లో వాయు కాలుష్యం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా పేలవమైన (వెరీ పూర్) కేటగిరిలో వాయు నాణ్యత ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై 300 పాయింట్లకు వాయు నాణ్యత చేరింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 18: ఢిల్లీ ఎన్సీఆర్‌లో వాయు కాలుష్యం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా పేలవమైన (వెరీ పూర్) కేటగిరిలో వాయు నాణ్యత ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై 300 పాయింట్లకు వాయు నాణ్యత చేరింది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో పంట వ్యర్థాల సహనంతో ఢిల్లీ ఎన్సీఆర్‌పై కాలుష్య ప్రభావం పడింది. ఆనంద్ విహార్, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్ లో కూడా వాయు కాలుష్యం పెరిగింది.
ఆనంద్ విహార్ లో 384, వజీర్‌పూర్ 351, జహంగీర్‌పురి 342, బవానా 315, సిరి ఫోర్ట్ 309 పాయింట్లుగా AQI లెవల్స్ నమోదమయ్యాయి. కాలుష్య ప్రభావంతో ఢిల్లీ ఎన్సీఆర్‌లో విజబులిటీ తగ్గింది. కాలుష్య ప్రభావంతో దగ్గు, కళ్ళల్లో మంటలు, గొంతు నొప్పితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం పెరిగిపోవడం దృష్ట్యా ఢిల్లీలో ఎన్సీఆర్ లో గ్రాప్ 1 కాలుష్య నియంత్రణ చర్యలు అమలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Kalvakuntla Kavitha: తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం: కవిత