Share News

Priyanka Chaturvedi: పాక్‌తో క్రికెట్ సిరీస్ నుంచి తప్పుకున్న అప్ఘానిస్థాన్.. బీసీసీఐకి ప్రియాంక చతుర్వేది చురకలు

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:40 AM

పాక్‌తో క్రికెట్ టోర్నీ నుంచి వైదొలగిన అప్ఘానిస్థాన్‌ను శివసేన యూబీటీ నేత ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు. అప్ఘానిస్థాన్‌ను చూసి భారత ప్రభుత్వం, బీసీసీఐ నేర్చుకోవాలని చురకలంటించారు.

Priyanka Chaturvedi: పాక్‌తో క్రికెట్ సిరీస్ నుంచి తప్పుకున్న అప్ఘానిస్థాన్.. బీసీసీఐకి ప్రియాంక చతుర్వేది చురకలు

ఇంటర్నెట్ డెస్క్: అప్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌ వైమానిక దాడుల్లో అప్ఘాన్ క్రికెటర్లు మరణించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. పాక్, శ్రీలంక పాల్గొంటున్న త్రైపాక్షిక టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు అప్ఘాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

క్రీడల కంటే జాతి ప్రయోజనాలకే అప్ఘానిస్థాన్ ప్రాధాన్యం ఇచ్చిందని ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు. భారత్, బీసీసీఐ అప్ఘాన్‌ను చూసి నేర్చుకోవాలని చురకలంటించారు. అమాయకుల రక్తాన్ని కళ్లచూసే పిరికిపందలతో పాక్ పాలకవర్గం నిండిపోయిందని మండిపడ్డారు. సరిహద్దు ఘర్షణల్లో మాత్రం పాక్ వర్గాలు చావుదెబ్బలు తింటుంటాయని ఎద్దేవా చేశారు.

అప్ఘానిస్థాన్‌కు సంఘీభావంగా శ్రీలంక కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని ప్రియాంక చతుర్వేది సూచించారు. 2009లో పాక్‌ టూర్ సందర్భంగా శ్రీలంక టీమ్‌పై కూడా దాడి జరిగిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. బీసీసీఐ వలె కాకుండా ఇతర ఆసియా దేశాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.


పహల్గాం దాడి తరువాత పాక్‌తో కలిసి ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పాక్‌తో ఆడేందుకు సిద్ధమైనందుకు బీసీసీఐపై క్రికెట్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక గత వారం రోజులుగా పాక్, అప్ఘానిస్థాన్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ విషయంలో ఇప్పటికే ఇరు దేశాలు దోహా వేదికగా చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే, కాల్పుల విరమణ అవగాహన తరువాత మూడో రోజునే పాక్ అప్ఘానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపి అమాయకులను పొట్టనపెట్టుకుంది. అప్ఘానిస్థాన్‌లోని పట్కాయ్ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో 8 మంది సామాన్య పౌరులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు దేశవాళీ క్రికెట్ ప్లేయర్స్‌ కూడా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

మీ 4వ భార్యకు నెలకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సిందే.. ఎంపీకి తేల్చి చెప్పిన హైకోర్టు

బిహార్ ఎన్నికలు.. పర్దానషీన్ మహిళా ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 18 , 2025 | 11:45 AM