Delhi: ఢిల్లీ పీఠంపై మహిళా సీఎం.. జోరుగా ఊహాగానాలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 09:46 PM
నజఫ్‌గఢ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా నీలం పహల్వాన్ ఎన్నిక కాగా, షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రేఖా గుప్తా గతంలో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వాజీపూర్ నుంచి పూనమ్ శర్మ గెలుపొందగా, షికారాయ్ ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) బీజేపీ ఘనవిజయం సాధించడంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన నుంచి తిరిగిరాగానే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ క్రమంలో సీఎం పదవిని ఎవరిని వరించనుందనే ఊహాగానాలు జోరందుకుంటున్నారు. మహిళా ముఖ్యమంత్రికి ఈసారి అవకాశం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో నలుగురు మహిళా ఎమ్మెల్యేలు- నీలం పహల్వాన్, రేఖా గుప్తా, పూనం శర్మ, షికా రాయ్ ఉన్నారు.
Yamuna Curse: యమునా శాపం తగిలింది.. అతిషితో ఎల్జీ
నజఫ్‌గఢ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా నీలం పహల్వాన్ ఎన్నిక కాగా, షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రేఖా గుప్తా గతంలో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వాజీపూర్ నుంచి పూనమ్ శర్మ గెలుపొందగా, షికారాయ్ ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్‌ను ఓడించారు.
కుల సమీకరణలు..
కాగా, సీఎం ఎంపికల కుల సమీకరణలను కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గానికి చెందిన వారికి సీఎంగా అవకాశం ఇచ్చే వీలుందని అంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. మాంగోల్‌పురి నుంచి ఎన్నికైన రాజ్ కుమార్ చౌహాన్, త్రిలోక్‌పురి నుంచి గెలిచిన రవికాంత్ ఉజ్జయిన్, బవానా నుంచి నెగ్గిన రవీందర్ ఇంద్రజ్ సింగ్, మాదిపూర్ నుంచి గెలుపొందిన కైలాష్ గాంగ్వాల్ వీరిలో ఉన్నారు.
ఫ్రంట్ రన్నర్ పర్వేష్ వర్మ
కొత్త సీఎంగా బీజేపీ అధిష్ఠానం పలువురు పేర్లు పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ప్రచారం సాగించి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ మంచి వక్తగానే కాకుండా, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంలో కూడా ముందున్నారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..